తేజ స‌జ్జ `ఇష్క్‌` ట్రైల‌ర్ వ‌చ్చేసింది!

Teja sajja ishq trailer set to unveiled 
Teja sajja ishq trailer set to unveiled

చైల్డ్ ఆర్టిస్ట్‌గా మంచి పేరు తెచ్చుకున్న తేజ స‌జ్జ హీరోగా ఎంట్రీ ఇచ్చిన చిత్రం `జోంబిరెడ్డి`. ప్ర‌శాంత్ వ‌ర్మ తెర‌కెక్కించిన ఈ చిత్రం ఈ ఏడాది విడుద‌లై మంచి విజ‌యాన్ని సొంతం చేసుకోవ‌డ‌మే కాకుండా హీరోగా తేజ స‌జ్జ‌కు మంచి పేరుని తెచ్చిపెట్టింది. ఇదే ఏడాది మ‌రో చిత్రంతో తేజ ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించ‌బోతున్నాడు.

తేజ స‌జ్జ హీరోగా న‌టిస్తున్న చిత్రం `ఇష్క్‌`. `ఇట్స్ నాట్ ఏ ల‌వ్‌స్టోరీ` అని ఉప‌శీర్షిక‌. వింక్ గ‌ళ్ ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. య‌స్.య‌స్‌. రాజు ద‌ర్శ‌‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్న ఈ మూవీని ఆర్‌.బి. చౌద‌రి స‌మ‌ర్ప‌ణ‌లో ఎన్‌వి ప్ర‌సాద్‌, ప‌రాస్ జైన్, వాకాడ అంజ‌న్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ నెల 23న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సంద‌ర్భంగా ఈ చిత్ర ట్రైల‌ర్‌ని హీరో సాయి ధ‌ర‌మ్‌తేజ్ గురువారం విడుద‌ల చేశారు.

విశాఖ బీచ్ విజువ‌ల్స్‌తో ట్రైల‌ర్ మొద‌లైంది. `అను రేపు నైట్ నీ బ‌ర్త్‌డే ప్లాన్ గురించి ఆలోచిస్తున్నా..రేపు నువ్వు, నేను కారులో .. ఆ కార్ బీచ్ రోడ్‌లో… ఒక ముద్దిస్తావా…` అంటూ తేజ స‌జ్జ చెబుతున్న డైలాగ్‌ల‌తో ట్రైల‌ర్ మొద‌లైంది.. `ఇట్స్ నాట్ ఏ ల‌వ్‌స్టోరీ` అనే ట్యాగ్ లైన్‌కి త‌గ్గ‌ట్టుగానే సినిమా ఆద్యంతం ఉత్కంఠ‌భ‌రితంగా సాగే థ్రిల్ల‌ర్‌లా క‌నిపిస్తోంది. మ‌హ‌తి స్వ‌ర సాగ‌ర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ ఈ నెల 23న విడుద‌ల కాబోతోంది.