బాలీవుడ్ హీరో కోసం వేట కొనసాగిస్తోన్న తేజ


బాలీవుడ్ హీరో కోసం వేట కొనసాగిస్తోన్న తేజ
బాలీవుడ్ హీరో కోసం వేట కొనసాగిస్తోన్న తేజ

దర్శకుడు తేజ నేనే రాజు నేనే మంత్రి సినిమాతో సక్సెస్ ను అందుకుని బౌన్స్ బ్యాక్ అయ్యాడు. అయితే ఆ తర్వాత సీత వంటి చిత్రంతో మళ్ళీ ప్లాప్ ను మూటకట్టుకోవాల్సి వచ్చింది. సీత తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న తేజ, రెండు ప్రాజెక్టులతో ముందుకు వచ్చాడు. అందులో మొదటిది గోపీచంద్ హీరోగా అలివేలు మంగ వెంకటరమణ.

అయితే ఈ సినిమా షూటింగ్ మొదలవుతుంది అనగా కొన్ని కారణాల వల్ల గోపీచంద్ తప్పుకున్నట్లు తెలుస్తోంది. అలాగే హీరోయిన్ల విషయంలో చాలా మందిని అనుకున్నా ఎవరూ సెట్ అవ్వలేదు. చివరికి తాప్సిను ఫైనల్ చేసాడు తేజ. తాప్సి టీమ్ లోకి వచ్చాక ఈ చిత్రాన్ని ప్యాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కించాలనుకుంటున్నాడు.

ఇందుకోసం తేజ బాలీవుడ్ హీరోతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనను చేసి చివరికి ఆ డెసిషన్ కే ఫిక్స్ అయినట్లు సమాచారం. ప్రస్తుతం బాలీవుడ్ హీరో కోసం వేట కొనసాగిస్తున్నాడు తేజ. చూడాలి మరి ఎవరు ఫైనల్ అవుతారో.