`క‌మిట్‌మెంట్`‌లో మ‌రింత బోల్డ్‌గా..


`క‌మిట్‌మెంట్`‌లో మ‌రింత బోల్డ్‌గా..
`క‌మిట్‌మెంట్`‌లో మ‌రింత బోల్డ్‌గా..

తేజ‌స్వీ మదివాడ‌.. హీరోయిన్‌కు కావాల్సిన అందం, అభిన‌యం అన్నీ వున్నా హీరోయిన్ పాత్ర‌ల‌కు స్నేహితురాలిగా, చెల్లెలి పాత్ర‌ల్లో మెరిసింది. సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు, శ్రీ‌మంతుడు, పండ‌గ చేస్కో వంటి చిత్రాల్లో చిన్న చిన్న పాత్ర‌ల్లో న‌టించింది. కానీ వ‌ర్మ తీసిన `ఐస్‌క్రీమ్` సినిమాతో పాపుల‌ర్ అయింది. ఆ త‌రువాత కొంత స్పీడు త‌గ్గించిన ఈ అమ్మ‌డు గ‌త కొంత కాలంగా మ‌ళ్లీ హాట్ టాపిక్‌గా మారింది. సోష‌ల్ మీడియా ఇన్ స్టా వేదిక‌గా హాట్ హాట్ ఫొటోల‌తో నెటిజ‌న్స్‌ని హీటెక్కిస్తున్న తేజ‌స్వీ ఇటీవ‌ల క‌మిట్‌మెంట్‌, కాస్టింగ్ కౌచ్ గురించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే.

తాజాగా ఆమె న‌టిస్తున్న తాజా చిత్రం `క‌మిట్‌మెంట్‌`.  ల‌క్ష్మీ కాంత్ చెన్న ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. క‌మిట్‌మెంట్‌ల నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని చాలా బోల్డ్‌గా తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో తేజ‌స్వీ మ‌దివాడ మ‌రింత బోల్డ్‌గా క‌నిపించ‌బోతోంది. బ‌ల్‌దేవ్ సింగ్‌, నీలిమ ఈ చిత్రాన్ని నిర్మ‌స్తున్నారు. శుక్ర‌వారం తేజ‌స్వీ పుట్టిన రోజు ఈ సంద‌ర్భంగా చిత్ర బృందం తేజ‌స్వీకి సంబంధించిన ఓ హాట్ పోస్ట‌ర్‌ని రిలీజ్ చేసింది.

ఈ పోస్ట‌ర్‌లో తేజ‌స్వీ టు పీస్ బికినీలో అందాలు ఆర‌బోస్తూ మ‌రింత హాట్‌గా, మ‌రింత బోల్డ్‌గా క‌నిపిస్తోంది. స్టిల్‌ని బ‌ట్టే సినిమాలో తేజ‌స్వీ ఏ రేంజ్‌లో అందాల విందు చేసిందో అర్థ‌మ‌వుతోంది.  చూస్తుంటే `క‌మిట్‌మెంట్‌` సినిమాతో తేజ‌స్వీ టాలీవుడ్‌లో ర‌చ్చ చేయ‌బోతోంద‌ని అర్థ‌మౌతోంది. ఈ మూవీతో తేజ‌స్వీ బిగ్ హిట్‌ని సొంతం చేసుకుంటుందేమో చూడాలి.