అంతా పడక గది కి రమ్మనే వారే!


అంతా పడక గది కి రమ్మనే వారే!
అంతా పడక గది కి రమ్మనే వారే!

బాలీవుడ్ లో  సంచలనం సృష్టించిన క్యాస్టింగ్ కౌచ్ టాలీవుడ్ లోనూ ప్రకంపనలు సృష్టించింది. శ్రీరెడ్డి కారణంగా టాలీవుడ్ లోనూ క్యాస్టింగ్ కౌచ్ తారా స్థాయికి చేరిందని జాతీయస్థాయిలో చర్చ జరిగింది. తాజాగా లైంగిక వేధింపులపై నటి తేజస్వి మదివాడ  చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

తేజస్వి నటిస్తున్న తాజా చిత్రం ‘ కమిట్మెంట్’. లష్మికాంత్ చెన్న దర్శకత్వం వహిస్తున్నారు. ఇండస్ట్రీ లోని కమిట్మెంట్స్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన తేజస్వి క్యాస్టింగ్ కౌచ్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్ స్టార్స్ దేనికైనా సిద్దపడతారని, ఏది అడిగినా అడ్డుచెప్పరని  వారిని తీసుకుంటున్నారని, అయితే అందులో 20 శాతం మంది వల్లే తమలాంటి వారిని కూడా అదే తరహాలో చూస్తున్నారని తేజస్వి తెలిపింది.
టాలీవుడ్ లో అంతా తనని పడక గదికి వస్తావా అని  అడిగినవారు నాని , దానికి కమిట్మెంట్ అని పేరు పెట్టారని చెప్పుకొచ్చింది. అందుకు తాను  అంగీకరించలేదు కాబట్టే రేసులో వెనకపడ్డానని, ఇండస్ట్రీకి వచ్చేవాళ్ళు ముందే కమిట్మెంట్ కి సిద్దపడే వస్తున్నారని  వాళ్లలా ఉంటేనే ఇక్కడ ముందుకు వెళతామని తెలిపింది. ఓ హిందీ వెబ్ series లో నగ్నంగా నటించామన్నారని, అందుకు తానూ అంగీకరించకపోవడంతో తనను తప్పించారని వెల్లడించింది. ఇకపై న్యూడ్ గా నటించడానికి తాన సిద్ధమని తేజస్వి స్పష్టం చేసింది.