నరాలు తెగే ఉత్కంఠ

telangana assembly counting startsఈరోజు తెలంగాణతో పాటుగా మరో నాలుగు రాష్ట్రాల ఫలితాలు కూడా వెలువడనున్న నేపథ్యంలో నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది . తెలంగాణతో పాటుగా రాజస్థాన్ , మిజోరాం , మధ్యప్రదేశ్ , ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి . ఇక తెలంగాణ విషయానికి వస్తే ……. కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడించడానికి కాంగ్రెస్ , టీడీపీ , టీజెఎస్ , సిపిఐ కలిసి ప్రజాకూటమి గా ఏర్పడ్డాయి .

 

తెలంగాణలో మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నట్లు జాతీయ సర్వేలు అన్ని తేల్చి చెప్పగా ఒక్క లగడపాటి రాజగోపాల్ మాత్రం కాంగ్రెస్ – టీడీపీ కూటమి అధికారంలోకి వస్తోందని చెప్పారు దాంతో నరాలు తెగే ఉత్కంఠ మొదలయ్యింది . దానికి తోడు గజ్వేల్ లో ఎవరు గెలుస్తారు ? కొడంగల్ లో అలాగే కూకట్ పల్లి లో నందమూరి సుహాసిని గెలుస్తుందా ? గెలిస్తే ఎన్ని ఓట్ల మెజారిటీ తో గెలుస్తుంది అన్న ఉత్సాహంతో పెద్ద ఎత్తున బెట్టింగ్ లు కూడా చేసారు . ఇప్పుడే కౌంటింగ్ ప్రారంభమైంది పూర్తిస్థాయి ఫలితాలు వెలువడటానికి సాయంత్రం అవుతుంది అయితే తీర్పు ఎలా ఉండబోతోందో మాత్రం 11 గంటలలోపు తెలుస్తుంది . ఎవరు అధికారం చేపట్టబోతున్నారో 11 గంటల కల్లా తెలుస్తుంది .

English Title: Telangana assembly election results 2018 counting starts