సినిమా నిర్మిస్తానంటున్న కేసీఆర్ Telangana CM KCR meets Director K. Vishwnath
Telangana CM KCR meets Director K. Vishwnath

ప్రముఖ దర్శకులు కే. విశ్వనాధ్ ఇంటికి వచ్చి పలకరించి సంచలనం సృష్టించాడు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు . కే విశ్వనాధ్ ఆరోగ్యం గురించి వాకబు చేయడమే కాకుండా గంటకు పైగా ఆయనతో సమాలోచనలు చేసి మీరు మళ్ళీ సినిమా తీయాలి , సందేశాత్మక చిత్రం చేస్తానంటే ఆ సినిమాని నిర్మించే బాధ్యత నేను తీసుకుంటాను అని చెప్పి మరింత సంచలనం సృష్టించాడు కేసీఆర్ .

విశ్వనాధ్  దర్శకత్వం వహించిన శంకరాభరణం చిత్రాన్ని 25 సార్లు చూసాను , ఇప్పటికి కూడా ఖాళీ సమయం దొరికితే తప్పకుండా         ఆయన చిత్రాలు చూస్తుంటాను , ఈమధ్య కాలంలో మంచి సినిమాలు రావడం లేదు అందుకే మీరు మళ్ళీ ఓ సినిమా తీయాలి దాన్ని నేనే నిర్మిస్తాను అంటూ చెప్పడంతో విశ్వనాద్ ఉబ్బి తబ్బిబ్బై పోతున్నాడు . కుచేలుడి ఇంటికి శ్రీకృష్ణుడు వచ్చినట్లుగా భావిస్తున్నానని , అయితే సినిమా తీసే ఓపిక మాత్రం లేదని తెలిపాడు . కేసీఆర్ విశ్వనాద్ ఇంటికి వస్తున్న విషయం మీడియాకు తెలియడంతో విశ్వనాద్ అనారోగ్యంతో బాధపడుతున్నాడని అందుకే పరామర్శ కోసమే కేసీఆర్ వస్తన్నారని పుకార్లు షికారు చేసాయి దాంతో విశ్వనాధ్ చాలా బాధపడ్డాడు .