ఓటు హక్కు మన ఆయుధం – నిర్భయంగా వేయండి


Telangana elections polling starts

తెలంగాణలో ఓటింగ్ మొదలయ్యింది , ఈరోజు తెల్లవారుఝామునే ఓటు వేయడానికి ఉత్సాహంగా వెళ్లారు ఓటర్లు . అయితే తెలంగాణ వ్యాప్తంగా చాలా చోట్ల ఈవీఎం లు మొరాయించాయి దాంతో కొన్ని చోట్ల పోలింగ్ మందకొడిగా సాగుతుండగా మిగతా చోట్ల పోలింగ్ బాగానే సాగుతోంది . ఇక పలువురు రాజకీయ నాయకులు , సినిమా స్టార్ లు కూడా క్యూలో నిలబడి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు . ఇంకా పలువురు సెలబ్రిటీలు తమ ఓటు హక్కు వినియోగించుకుంటూ ఓటర్లకు సందేశం కూడా ఇస్తున్నారు .

ఓటు హక్కు ఉన్న వాళ్ళు అందరూ తప్పకుండా ఓటు హక్కు వినియోగించాలి అంటూ పలువురు చెబుతున్నారు . ఇక యువత తో పాటుగా ఓటర్లు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి అని భావిస్తున్నారు . టిఆర్ఎస్ పార్టీ మళ్ళీ మేమె అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తుండగా కాంగ్రెస్ – టీడీపీ కూటమి మాత్రం మేమే అధికారంలోకి వస్తామని ధీమాగా ఉన్నారు . అయితే సాయంత్రానికి లగడపాటి రాజగోపాల్ తన పూర్తి సర్వే వివరాలను ఈరోజు ప్రకటించనున్నాడు .

English Title: Telangana elections polling starts