ముగిసిన పోలింగ్


telangana elections polling update

తెలంగాణ ఎన్నికలకు పోలింగ్ ముగిసింది . అయితే సాయంత్రం అయిదు గంటల లోపు క్యూలో ఉన్నవాళ్ళ కు మాత్రం ఓటు వేసే అవకాశం కల్పించారు . తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 70 శాతం పోలింగ్ నమోదు అయినట్లు తెలుస్తోంది . గ్రామీణ ప్రాంతాల్లో ఓటింగ్ అత్యధికంగా నమోదు కాగా పట్టణ ప్రాంతాల్లో మాత్రం ఓట్లు వేయడానికి పెద్దగా ఆసక్తి చూపించలేదు . హైదరాబాద్ లాంటి మహానగరంలో మరీ దారుణంగా ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకోలేకపోయారు .

 

అయితే కొంతమంది ఓట్లు వేయడానికి వచ్చినప్పటికీ ఓటర్ లిస్ట్ లో తమ పేర్లు లేకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు . ఓటరు లిస్ట్ లో ఉన్నవాళ్లు ఓట్లు వేయడానికి రాలేదు , వచ్చిన వాళ్లకు ఓటరు లిస్ట్ లో పేర్లు లేకపోవడం వివాదానికి దారి తీసింది . అలాగే తెలంగాణ వ్యాప్తంగా పలు అల్లర్లు చెలరేగాయి పోలింగ్ సందర్బంగా . కాంగ్రెస్ – టీఆర్ఎస్ శ్రేణుల మధ్య చాలాచోట్ల గొడవలు జరిగాయి అయితే అవి మరీ పెద్దవి కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు పోలీసులు . పూర్తిస్థాయి పోలింగ్ శాతం ఎంత అనేది కాస్త ఆలస్యంగా తెలియనుంది .

English Title: telangana elections polling update