మాజీ హోమ్ మినిస్ట‌ర్ నాయిని న‌ర్సింహారెడ్డి మృతి!


మాజీ హోమ్ మినిస్ట‌ర్ నాయిని న‌ర్సింహారెడ్డి మృతి!
మాజీ హోమ్ మినిస్ట‌ర్ నాయిని న‌ర్సింహారెడ్డి మృతి!

రాష్ట్ర హోం శాఖ మాజీ మంత్రి, కార్మిక నేత నాయిని న‌ర్సింహారెడ్డి (80) బుధ‌వారం అర్థ్ర రాత్రి అనారోగ్యంతో మృతి చెందారు. గ‌త కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న అర్థ్ర రాత్రి 12:25 నిమిషాల‌కు జూబ్లీ హిల్స్ లోని అపోలో హాస్పిట‌ల్‌లో తుది శ్వాస విడిచార‌ని ఆసుప‌త్రి వ‌ర్గాలు తెలిపాయి. సెప్టెంబ‌ర్ 28న మ‌హ‌మ్మారి క‌రోనా బారిన ప‌డిన ఆయ‌న జూబ్లీ హిల్స్ లోని అపోలో హాస్పిట‌ల్‌లో గ‌త కొన్ని రోజులుగా చికిత్స పొందుతున్నారు.

అయితే ఇటీవ‌ల నిర్వ‌హించిన టెస్టుల్లో ఆయ‌న‌కు నెగెటివ్ రావ‌డంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆ త‌రువాత నుంచి ఆయ‌న ఊపిరి తీసుకోవ‌డం క‌ష్టంగా మారింది. శ‌రీరంలో ఆక్సిజ‌న్ లెవెల్స్ ఒక్క‌సారిగా త‌గ్గిపోయాయి. ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన వైద్యులు న్యుమోనియా సోకిన‌ట్టు తేల్చారు. దీంతో ఆయ‌న‌ని కుటుంబ స‌భ్యులు జూబ్లీ హిల్స్ లోని అపోలో హాస్పిట‌ల్‌లో చేర్పించారు. అప్ప‌టి నుంచి వెంటిలేట‌ర్‌పై చికిత్స అందిస్తున్నారు.

బుధ‌వారం ఆరోగ్యం విష‌మించ‌డంతో బుధ‌వారం ఆర్థ్ర రాత్రి నాయిని క‌న్నుమూశారు. నాయిని ప‌రిస్థితి విష‌మంగా వుంద‌ని తెలుసుకున్న ముఖ్య‌మంత్రి కేసీఆర్ వెంట‌నే ఆసుప‌త్రికి వెళ్లి నాయిని అల్లుడు శ్రీ‌నివాస‌రెడ్డిని ప‌రామ‌ర్శించి ఓదార్చారు. తెలంగాణ ఉద్య‌మంలో నాయినిది ప్ర‌త్యేక స్థానం. కేసీఆర్‌కు అండ‌గా నిలిచిన నేత ఆయ‌న‌.