తెలుగు, త‌మిళ్ లో హిట్స్ అందుకున్న – తెలుగు సినిమా రచయిత ఆదినారాయ‌ణ‌..!


telugu cinema writer adhinarayana press meet

ఈ సంక్రాంతికి తెలుగులో ఎఫ్ 2, త‌మిళ్ లో విశ్వాసం చిత్రాల‌తో ఒకేసారి సూప‌ర్ హిట్స్ సాధించ‌డం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు రచయిత ‘ఆదినారాయణ. తెలుగులో సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్ 2 చిత్రాల‌కు…త‌మిళ్ లో వీర‌మ్, వేదాళ‌మ్, వివేగం, విశ్వాసం..చిత్రాల‌కు రైట‌ర్ గా వ‌ర్క్ చేసి వ‌రుస‌గా విజ‌యాలు సాధించి న తెలుగు రైట‌ర్ ఆది నారాయ‌ణ‌. ఓ వైపు తెలుగు, మ‌రో వైపు త‌మిళ్..రెండు భాష‌ల్లో త‌ను వ‌ర్క్ చేసిన చిత్రాలు ఘనవిజయాలు సాధించ‌డంలో ర‌చ‌యిత‌గా కీల‌క పాత్ర పోషించారు ఆయ‌న‌. దీంతో ఆదినారాయ‌ణ తెలుగు, త‌మిళ్ రెండు భాషా చిత్రాల‌లో బిజీ అయ్యారు.

ఆదినారాయ‌ణ స్వ‌గ్రామం అమ‌లాపురం ద‌గ్గ‌ర ఈద‌ర‌ప‌ల్లి. చిన్న‌ప్ప‌టి నుంచి ఆయ‌న‌కు సినిమాలంటే పిచ్చి. హీరో గోపీచంద్ ఒంట‌రి సినిమాకి డైరెక్ష‌న్ డిపార్టెమెంట్ లో వ‌ర్క్ చేసారు. ఆయ‌న ద్వారా డైరెక్ట‌ర్ ‘శౌర్యం’ శివ ప‌రిచ‌యం అవ్వ‌డంతో ‘ద‌రువు’సినిమాకి వ‌ర్క్ చేసారు. అలాగే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ‘బంగారం’, అల్ల‌రి న‌రేష్ ‘సుడిగాడు’, క‌ళ్యాణ్ రామ్ ‘ఎం.ఎల్.ఎ’ మూవీకి పని చేశారు. ‘ల‌క్ష్మీ’, కృష్ణ‌, నాయ‌క్ చిత్రాల ర‌చ‌యిత‌ ఆకుల శివ ద‌గ్గ‌ర వ‌ర్క్ చేసారు.

ప్ర‌స్తుతం బ్లాక్ బస్టర్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి తదుపరి చిత్రాన్నికి, శౌర్యం శివ త‌దుప‌రి చిత్రానికి, కందిరీగ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ తో మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మించే మూవీకి వ‌ర్క్ చేస్తున్నారు. తెలుగు, త‌మిళ్ రెండు భాష‌ల్లో విభిన్న క‌థల‌తో తెలుగు ర‌చ‌యిత ఆదినారాయ‌ణ‌ వ‌రుస విజ‌యాలు సాధిస్తుండ‌డం అభినంద‌నీయం.రచయితగా తనకు ప్రోత్సాహం అందిస్తున్న అందరికి ఈ సందర్భంగా కృతఙ్ఞతలు తెలిపారు ఆదినారాయణ.