తెలుగులో ‘లస్ట్ స్టోరీస్’ చేస్తున్నారు దానికి దర్శకులు నలుగురు


తెలుగులో 'లస్ట్ స్టోరీస్' చేస్తున్నారు దానికి దర్శకులు నలుగురు
తెలుగులో ‘లస్ట్ స్టోరీస్’ చేస్తున్నారు దానికి దర్శకులు నలుగురు

మన తెలుగు సినిమాలకి, హిందీ సినిమాలకి దృఢమైన ఒక గట్టి పోటీ ఉంటుంది. నువ్వా -నేనా అన్నట్టు సాగుతుంది పోటీ, మన సినిమాల కథల విషయంలో, థియేటర్ లోకి  వచ్చే సినిమాల విషయంలో గెలిచి మన తెలుగు సినిమాలు ఒక మెట్టు పైకి ఎక్కుతున్నప్పటికీ…. డిజిటల్ మీడియా అనగా వెబ్ సిరీస్ ల పరంగా చూసుకుంటే వారు ఎక్కడో పైన ఉంటే మనం ఇంకా కిందనే ఉండిపోతున్నాము. కారణం మన తెలుగు వెబ్ సిరీస్ లకి ఆదరణ తగ్గుతున్నాయి. బాలీవుడ్ లో నెలకి సంబంధించి చాలా వెబ్ సిరీస్ లు విడుదల  అవుతున్నాయి అవి బాగా ఆదరణ పొందుతున్నాయి.

అలా బాలీవుడ్ వెబ్ సిరీస్ లో ఇప్పటి వరకు ‘గాంది బాత్ 3’, ‘ఘోస్ట్’, ‘లస్ట్ స్టోరీస్’ బాగా ఆదరణ పొందాయి. ఇప్పుడు ఆ మూడింటిలో లస్ట్ స్టోరీస్ ని మన తెలుగు వారి నేటివిటీ కి తగ్గట్టుగా అందించాలని నిర్మాత ‘రోని స్క్రూవాలా’ నిర్ణయించుకున్నారు. లస్ట్ స్టోరీస్ కథ విషయానికి వస్తే నలుగురు జంటల మధ్య వారి ప్రయాణానికి సంబంధించింది. మరి ఆ నాలుగు జంటలని ఒక్క దర్శకుడు కాకుండా నలుగురు దర్శకులు కలిసి నాలుగు భాగాలుగా డైరెక్ట్ చేపించాలని ‘నందిని రెడ్డి’, ‘సందీప్ రెడ్డి వంగా’, ‘సంకల్ప్ రెడ్డి’, ‘తరుణ్ భాస్కర్’ వంటి యువ దిగ్గజాలని రంగం లోకి దింపారు నిర్మాత ‘రోని స్క్రూవాలా’ గారు.

ఇక మొదటి భాగం విషయానికి వస్తే అందులో నటించే జంటలకి సంబందించిన షూటింగ్ ని నందిని రెడ్డి గారు డైరెక్ట్ చేసారు. ఇందులో అమ‌లాపాల్‌ – జగపతి బాబు గారు కలిసి ఒక జంటగా నటించారు.  అమ‌లాపాల్‌ కేవలం 10 రోజుల్లోనే తనకి సంబందించిన షూటింగ్ జరిపించుకోవటం చూస్తుంటే నందిని రెడ్డి గారిని పూర్తిగా నమ్మడం, డైరెక్టర్ గారు చెప్పింది చేసుకుంటూ వెళ్లిపోవడం వల్లనే సాధ్యం అయింది. పూర్తిగా విభిన్నమైన కలయిక అయిన జగపతి బాబు –  అమ‌లాపాల్‌ ని నందిని రెడ్డి గారు ఎలా డైరెక్ట్ చేసారో? వారి ఎమోష‌న్స్ ని ఎలా చూపిస్తారో? అని ఒక్కసారిగా ఈ వెబ్ సిరీస్ గురించి ప్రజలందరు ఆలోచించుకునేలా చేసారు.

మరి తరుణ్ భాస్కర్, సందీప్ రెడ్డి వంగా, సంకల్ప్ రెడ్డి మిగిలిన ముగ్గురు డైరెక్ట్ చేయబోయే మూడు భాగాల్లో నటి నటుల పరంగా ఎవరిని తీసుకుంటారో? మొదటి భాగం మొదట విడుదల చేస్తారా? లేక అన్ని భాగాలు షూటింగ్ అయిపోయిన తర్వాత ఒకొక్కటిగా విడుదల చేస్తారా? అనే జనాల ప్రశ్నలకి నిర్మాతలు, దర్శకులు మాత్రమే సమాధానం చెప్పాలి. మొత్తానికి నిర్మాత రోని స్క్రూవాలా గారు మంచి నిర్ణయం తీసుకున్నారు. ఈ విధంగా అయిన మన తెలుగు వెబ్ సిరీస్ ల మీద జనాలకి ఆసక్తి పెరుగుతుంది. తెలుగులో ఇంకా కొన్ని వెబ్ సిరీస్ లు నిర్మించడానికి పలువురు నిర్మాతలు ముందుకు వస్తారు. అలా అయిన మన తెలుగు వెబ్ సిరీస్ లు బాగా ఆదరణ పొంది హిందీ వారికి పోటీగా వెళ్లిపోవచ్చు.