రానా వల్ల విరాటపర్వానికి బ్రేక్


Rana Daggubati
Rana Daggubati

నీది నాది ఒకే కథ చిత్రంతో అందరినీ ఆకట్టుకున్న దర్శకుడు వేణు ఉడుగుల, తన రెండో ప్రయత్నంగా చేస్తున్న విరాటపర్వం ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. రానా, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో కనిపించనున్న ఈ చిత్రం తెలంగాణ ప్రాంతంలోని 1990 కాలం నాటి సామాజిక పరిస్థితులను ఆధారంగా చేసుకుని తెరకెక్కిస్తున్నారు. ఈ పీరియాడిక్ డ్రామాలో రానా నక్సలైట్ పాత్ర పోషిస్తుండగా, సాయి పల్లవి జానపద గాయనిగా కనిపించనుంది.

సాయి పల్లవికి సంబంధించిన సీన్ల షూటింగ్ పూర్తయింది. రానా కాంబినేషన్ లో సీన్ల చిత్రీకరణ జరపాల్సి ఉండగా, రానా అందుబాటులో లేకపోవడంతో షూటింగ్ కు తాత్కాలిక బ్రేక్ ఇచ్చారు. ప్రస్తుతం యూఎస్ లో ఉన్న రానా, రెండు వారాల తర్వాత తిరిగి ఇండియా చేరుకోనున్నారు.

రానా తిరిగి రాగానే, సాయి పల్లవితో ఉన్న కాంబినేషన్ సీన్లను, రానా సీన్లను త్వరగా చిత్రీకరించి షూటింగ్ ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ్ లోనూ ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.