తెనాలి రామకృష్ణ కేసు టేకప్ చేసేది అప్పుడే!


tenali ramakrishna
tenali ramakrishna

యువహీరో సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో కామెడీ చిత్రాల స్పెషలిస్ట్ జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం తెనాలి రామకృష్ణ బి.ఏ, బి.ఎల్. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంటోంది.

తెనాలి రామకృష్ణను అక్టోబర్ 18న విడుదల చేయాలని చిత్ర దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. సైరా అక్టోబర్ 2న విడుదలవుతుంది కాబట్టి రెండు వారాల సమయం ఉంటే బాగుంటుందని వారు అనుకుంటున్నారు.

కేసుల కోసం ఎదురుచూసే లాయర్ పాత్రలో సందీప్ కిషన్ నవ్వులు పండిస్తాడని చిత్ర బృందం అంటోంది. కేసుల కోసం సందీప్ పడే తిప్పలు, దాన్నుండి వచ్చే కామెడీ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు.

సందీప్ కిషన్ కు జోడిగా హన్సిక ఈ చిత్రంలో నటిస్తోంది. ఇటీవలే విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో ట్రైలర్ ను కూడా త్వరలో విడుదల చేయాలని భావిస్తున్నారు.