యాంకర్ ప్రదీప్ హీరోగా సక్సెస్ అవుతాడా.?


యాంకర్ ప్రదీప్ హీరోగా సక్సెస్ అవుతాడా.?
యాంకర్ ప్రదీప్ హీరోగా సక్సెస్ అవుతాడా.?

బుల్లి తెరపై తమ అదృష్టాన్ని పరీక్షించుకునే స్టార్లుగా ఎదిగి ఆ తర్వాత వెండితెరపై సినిమా అవకాశాలు దక్కించుకొని స్టార్ గా ఎదిగిన వాళ్లు చాలామంది ఉన్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ మొదట బుల్లి తెరపై నటించిన వాడే. అలా అని బుల్లితెరపై సక్సెస్ అయిన వాళ్ళు అందరూ వెండితెరపై సక్సెస్ అయిన దాఖలాలు కూడా ఎక్కువ శాతం లేవు.

బుల్లితెరపై “గడసరి అత్త సొగసరి కోడలు” అనే ఒక మంచి గేమ్ షో ద్వారా మన పక్కింటి అబ్బాయి లా కనబడుతూ, చలాకీగా మాట్లాడుతూ, సొంత మనిషిలా దగ్గరైన యాంకర్ ప్రదీప్ మాచిరాజు ప్రస్తుతం “30 రోజుల్లో ప్రేమించడం ఎలా..?” అనే సినిమా ద్వారా వెండి తెరకు పరిచయం అవుతున్నారు.

ఇప్పటికే ఈ సినిమాకు సంబందించిన పాట “నీలి నీలి ఆకాశం” సూపర్ ట్రేండింగ్ లో ఉంది. ఒక గ్రామీణ యువకుడి పాత్రలో ప్రదీప్ ఒదిగిపోయారు. ఇక ప్రదీప్ కు యూత్ లో ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. అటు సినిమా సెలబ్రిటీలతో, ఇటు మామూలు యువత తో కూడా కలిసి వినోద కార్యక్రమాలు చేస్తూ ఉంటారు మన ప్రదీప్. ఇటీవల గత ఐదు సంవత్సరాలుగా బుల్లితెరపై పలు గేమ్ షో లు మరియు వినోద కార్యక్రమాల ద్వారా మనలను ఎంటర్ టైన్ చేసే సెలబ్రిటీలు సినిమా హీరోలు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు వచ్చాయి కానీ దురదృష్టవశాత్తు ఎక్కువ శాతం ఎవరు సక్సెస్ కాలేదు.

కొంతమంది హీరోలుగా తమకు వచ్చిన లేదా తమకు నచ్చిన కథలు చేసుకుంటూనే హాస్య నటులుగా కెరీర్ కొనసాగిస్తున్నారు. కానీ మిగిలిన వాళ్లకు లేని విలక్షణత, కామెడీ టైమింగ్, గ్లామర్ మరియు యూత్ ఫాలోయింగ్ అన్నిటికీ మించి గుడ్ బాయ్ ఇమేజ్ ప్రదీప్ సొంతం.

ఇప్పటికే మరో రెండు మూడు సినిమాలు చర్చల దశలో ఉన్నా, తన తాజా చిత్రం “30 రోజుల్లో ప్రేమించడం ఎలా” సినిమాను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే ఫలితాన్ని బట్టి తాను భవిష్యత్తులో ఎలాంటి కథలు చేయాలో, క్లారిటీ తెచ్చుకోవాలని ప్రదీప్ అనుకుంటున్నాడు. ఇప్పటి వరకు బుల్లితెర పై అటు ఫ్యామిలీ ఆడియన్స్ ను యువతను అందరినీ ఆకట్టుకున్న ప్రదీప్ వెండితెరపై కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుందాం.