చిరు మాటతో క‌దిలిన మంత్రి!


చిరు మాటతో క‌దిలిన మంత్రి!
చిరు మాటతో క‌దిలిన మంత్రి!

ఇటీవ‌ల మెగాస్టార్ చిరంజీవి నివాసంలో ఇండ‌స్ట్రీ పెద్ద‌ల మీటింగ్ జ‌రిగింది. ఈ మీటింగ్‌కి సినిమాటోగ్ర‌ఫీ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస‌యాద‌వ్ హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా చిరంజీవి 14 వేల మంది సినీ కార్మికుల గురించి మంత్రి ఎదురుగానే కీల‌క వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. లాక్‌డౌన్ కార‌ణంగా షూటింగ్‌లు నిలిపి వేయ‌డంతో 14 వేల మంది డైలీ కార్మికులు ఇబ్బందులు ప‌డుతున్నార‌ని, వారి బాగోగులు ప్ర‌భుత్వాలు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని, వ‌చ్చే నెల వారికి నిత్యావ‌స‌రాలు ప్ర‌భుత్వ‌మే అందించాల‌ని వివ‌రించిన విష‌యం తెలిసిందే.

మెగాస్టార్ మాట‌ల‌కు క‌దిలిన మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస‌యాద‌వ్ మంగ‌ళ‌వారం సినీ కార్మికుల కుటుంబాల‌కు నిత్యావ‌స వ‌ప‌స్తువుల్ని పంపిణీ చేయ‌డం విశేషం. గ‌త నెల‌లో మెగాస్టార్ చిరంజీవి అధ్య‌క్ష‌త‌న సీసీసీ పేరుతో చారిటీని ప్రారంభించారు. దీని ద్వారా రోజు వారీ కార్మికుల‌కు నిత్యావ‌స‌ర వ‌స్తువుల్ని అందించారు. ఈ నెల కూడా సీసీసీ నుంచి నిత్యావ‌స‌రాలు వ‌స్తాయ‌ని అంతా ఎదురుచూస్తున్న వేళ సినిమాటోగ్ర‌ఫీ శాఖ మంత్రి అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

దాదాపు 14 వేల మంది సినీ కార్మికుల‌కు త‌ల‌సాని ట్ర‌స్ట్ ద్వారా నిత్యావ‌స‌ర స‌రుకుల్ని అందించ‌డానికి ముందుకొచ్చారు. ఓ ప్ర‌ణాళిక ప్ర‌కారం గురువారం ఈ కార్యక్ర‌మాన్ని నిర్వహించ‌నున్నారు. మిగ‌తా రంగాల‌తో పోలిస్తే సినీ రంగం క‌రోనా కార‌ణంగా చాలా ఇబ్బందుల్ని ఎదుర్కొంటోంద‌ని, సినీ ఇండ‌స్ట్రీ పెద్ద‌ల‌తో మాట్లాడిన‌ప్పుడు షూటింగ్‌, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ గురించి మాట్లాడ‌టం జ‌రిగింది. రెండు మూడు రోజుల్లో దీనికి సంబంధించిన విధి విధానాల‌ని ప్ర‌క‌టించ‌డం జ‌రుగుతుంది. ఇదే స‌మ‌యంలో 14 వేల మంది టీవీ, సినీ కార్మికులు నిత్యావ‌స‌రాల‌ని అందించ‌బోతున్నాం. రెండు మూడు నెల‌లుగా సినీ కార్మికుల‌కు ప‌నిలేదు. వీలైనంత త్వ‌ర‌లో షూటింగ్‌లు మొద‌లు కావ‌డానికి అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాం` అని త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ వెల్ల‌డించారు.