ఆ హీరోయిన్ పై స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తోన్న థమన్.. కారణమేంటి?


ఆ హీరోయిన్ పై స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తోన్న థమన్.. కారణమేంటి?
ఆ హీరోయిన్ పై స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తోన్న థమన్.. కారణమేంటి?

ఏ హీరోయిన్ అయినా కోరుకునే భారీ లాంచ్ పాయల్ రాజ్ పుత్ కు ఆరెక్స్ 100 సినిమాతో దక్కింది. నిజానికి ఇది చిన్న సినిమానే అయినా పెద్ద విజయం సాధించడానికి ప్రధాన కారణం పాయల్ పోషించిన ఇందు రోల్ ను తీర్చిదిద్దిన విధానం. మొదటినుండి హీరోపై మోజులో పడి ఉండే ఆ క్యారెక్టర్ లాస్ట్ లో ఇచ్చే ఆ ట్విస్ట్ ఎవరూ ఊహించలేరు. ఆరెక్స్ 100 తర్వాత పాయల్ పేరు టాలీవుడ్ లో మార్మోగిపోయింది. వరసగా అవకాశాల కోసం నిర్మాతలు సైతం క్యూ కట్టారు. అయితే సక్సెస్ వచ్చిన దానికన్నా దాన్ని ఎలా నిలబెట్టుకున్నాం అన్న దానిమీద ఎవరి కెరీర్ అయినా ఆధారపడి ఉంటుంది. పాయల్ ఈ విషయంలోనే ఫెయిల్ అయింది.

ఆరెక్స్ 100 తర్వాత ఏ మాత్రం అవసరం లేని ఐటెం సాంగ్ ను చేసింది పాయల్. సీతలో బుల్ రెడ్డి అంటూ చేసినా అది ఆమె కెరీర్ కు మేలు కంటే కీడే ఎక్కువ చేసింది. అలాగే ఆర్డీఎక్స్ లవ్ అనే చిత్రం ఎందుకు చేసిందో ఆమెకైనా తెలుసో లేదో. బి గ్రేడ్ వంటి కంటెంట్ తో తెరకెక్కిన ఆ సినిమా పాయల్ కెరీర్ కు పెద్ద దెబ్బ. అయితే ఆమె ఇప్పటికిప్పుడు కంగారు పడాల్సిన అవసరం లేదు. దానికి కారణం ఆమె చేతిలో రెండు బడా సినిమాలు ఉండడమే.

పాయల్ రాజ్ పుత్ చేతిలో ప్రస్తుతం వెంకీ మామ, డిస్కో రాజా చిత్రాలు ఉన్నాయి. వెంకీ మామ మరో మూడు రోజుల్లో డిసెంబర్ 13న విడుదల కానుండగా, డిస్కో రాజా జనవరి 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ రెండు చిత్రాలకు ఒక కామన్ పాయింట్ పాయల్ కాగా, మరో కామన్ పాయింట్ రెండిటికీ థమన్ సంగీత దర్శకుడు.

అయితే ఈ రెండు చిత్రాల్లో పాయల్ నటించడం వెనకాల థమన్ హ్యాండ్ కూడా ఉందని తెలుస్తోంది. అసలు సంగీత దర్శకుడికి హీరో, దర్శకుడు, నిర్మాతతో తప్పితే వేరే వారితో అసలు సంబంధమే ఉండదు. నటీనటుల సెలక్షన్ ప్రాసెస్ లో అసలే తలదూర్చరు. మరి థమన్ ఎందుకని పాయల్ పేరుని రికమెండ్ చేస్తున్నాడనేది ఇండస్ట్రీ వర్గాలకు కూడా అర్ధం కావడం లేదు. కారణమైతే తెలీదు కానీ ఈ ఇద్దరి మధ్యా ఏదో ఉందనే వార్త మాత్రం ఇండస్ట్రీ వర్గాలలో బాగా హల్చల్ చేస్తోంది.

ఏదేమైనా పాయల్ కు మాత్రం స్టార్ హీరోల సినిమాలలో నటించే అవకాశం వచ్చింది. మరి ఈ అవకాశాలని ఆమె ఎంత వరకూ సద్వినియోగం చేసుకుంటుందనేది చూడాలి. వెంకీ మామలో మరో హీరోయిన్ రాశి ఖన్నా నటిస్తోంది. అలాగే డిస్కో రాజాలో నభ నటేష్ మరో హీరోయిన్. ఇలా రెండు సినిమాలలో కూడా వేరే హీరోయిన్లతో స్క్రీన్ షేర్ చేసుకోవాల్సి వస్తోంది పాయల్ కు. చేతులారా కెరీర్ ను నాశనం చేసుకుంటున్న పాయల్ రాజ్ పుత్ కు థమన్ కారణంగా మరో లైఫ్ లైన్ దొరికినట్లయింది. మరి అది ఆమె ఉపయోగించుకోగలదా లేదా అన్నది జనవరి నెలాఖరుకి తేలిపోతుంది.