త‌మ‌న్ లేకుండా త్రివిక్ర‌మ్ సినిమా చేయ‌లేక‌పోతున్నాడా?

త‌మ‌న్ లేకుండా త్రివిక్ర‌మ్ సినిమా చేయ‌లేక‌పోతున్నాడా?
త‌మ‌న్ లేకుండా త్రివిక్ర‌మ్ సినిమా చేయ‌లేక‌పోతున్నాడా?

సినీ ఇండ‌స్ట్రీలో కొన్ని కాంబినేష‌న్‌ల‌కు తిరుగుండ‌దు. ఒక్క‌సారి సెట్ట‌యిన కాంబినేష‌న్స్ బ్లాక్ బ‌స్ట‌ర్ ప‌డితే మ‌ళ్లీ మ‌ళ్లీ రిపీట్ అయిన సంద‌ర్భాలు చాలా త‌క్కువ కానీ త్రివిక్ర‌మ్ – త‌మ‌న్‌ల జోడీ మాత్రం అలా కాదు. వీరి కాంబినేష‌న్ మ‌ళ్లీ మ‌ళ్లీ రిపీట్ అవుతోంది. ఎంత‌లా అంటే త‌మ‌న్ లేకుండే త్రివిక్ర‌మ్ సినిమా చేయ‌లేనంత‌గా. గ‌త ఏడాది ప్రారంభంలో ఈ జోడీ చేసిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు.

`అల వైకుంఠ‌పుర‌ములో` చిత్రంతో వీరిద్ద‌రు మ్యాజిక్ చేశారు. చెప్పుకునేంత గొప్ప క‌థ కాక‌పోయినా ఈ సినిమా ఇండ‌స్ట్రీ హిట్‌గా నిల‌ప‌డంలో త‌మ‌న్ అందించిన సంగీతం, పాట‌లు ప్ర‌ధాన పాత్ర పోషించాయ‌న్న‌ది జ‌గ‌మెరిగిన స‌త్యం. ఈ సినిమా త‌రువాత త‌మ‌న్‌, త్రివిక్ర‌మ్ మ‌ధ్య మంచి బాండింగ్ ఏర్ప‌డింది. ఎంత‌లా అంటే రాజ‌మౌళి సినిమా అంటే కీరవాణి మ్యూజిక్ డైరెక్ట‌ర్ అన్న‌ట్టుగా త్రివిక్ర‌మ్ సినిమా అంటే త‌మ‌న్ డిఫాల్ట్ గా మ్యూజిక్ డైరెక్టర్ ప్లేస్‌ని ఆక్ర‌మించేస్తున్నాడు.

ఎన్టీఆర్ నటించిన ‘అరవింద సమేత’ కోసం త్రివిక్రమ్‌తో కలిసి పనిచేసినప్పటి నుండి త‌మ‌న్ జ‌ర్నీ త్రివిక్ర‌మ్‌తో మొద‌లైంది. వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో వ‌చ్చిన రెండవ చిత్రం `అలా వైకుంఠాపురములో`. ఈ మూవీ ఆడియో ప‌రంగా ఏ స్థాయి సంచ‌ల‌నాలు సృష్టించిందో అంద‌రికి తెలిసిందే. త్రివిక్రమ్ తదుపరి చిత్రాన్ని మహేష్ బాబు తో చేయ‌నున్న విష‌యం తెలిసిందే. ఈ మూవీకి త‌మ‌న్‌ సంగీతం సమకూర్చనున్నారు. త్రివిక్ర‌మ్ డైలాగ్స్‌, స్క్రీన్‌ప్లే అందిస్తున్న‌‘అయ్యపనమ్ కోషియం’ రీమేక్ కు కూడా త‌మ‌నే సంగీతం అందిస్తుండ‌టం తెలిసిందే.