గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన త‌మ‌న్!

గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన త‌మ‌న్!
గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన త‌మ‌న్!

బ‌న్నీ న‌టించిన ఇండ‌స్ట్రీ హిట్ `అల వైకుంఠ‌పుర‌ములో` చిత్రంతో త‌మ‌న్ టాప్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ స్థానాన్ని సొంతం చేసుకున్నారు. ఈ మూవీ సాంగ్స్ మిలియ‌న్ ల వ్యూస్ సాధించ‌డంతో ఏ స్టార్ హీరో నోట విన్నా త‌మ‌న్ మాటే. తాజాగా త‌మ‌న్ గోల్డెన్ ఛాన్స్‌ని సొంతం చేసుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి చిత్రానికి సంగీతం అందించే అరుదైన అవ‌కాశాన్ని ద‌క్కించుకున్నాడు.

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం `ఆచార్య‌` చిత్రంలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ మూవీ త‌రువాత చిరు మ‌ల‌యాళ హిట్ ఫిల్మ్ `లూసీఫ‌ర్‌` రీమేక్‌లో న‌టించ‌నున్నారు. అత్యంత భారీ స్థాయిలో రూపొంద‌నున్న ఈ చిత్రాన్ని ఎన్వీ ప్ర‌సాద్ నిర్మించ‌బోతున్నారు. ఈ చిత్రానికి మోహ‌న్‌రాజా ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు.

యంగ్ హీరో స‌త్య‌దేవ్ కీ రోల్‌లో న‌టించ‌నున్న ఈ చిత్రానికి త‌మ‌న్ సంగీతం అందించ‌బోతున్నారు. ఈ విష‌యాన్ని ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించారు. చిరు ఫొటోని షేర్ చేసిన త‌మ‌న్ `ప్ర‌తీ మ్యూజిక్ కంపోజ‌ర్‌కి మెగాస్టార్‌తో క‌లిసి వ‌ర్క్ చేయాల‌న్న‌ది బిగ్ డ్రీమ్‌. మెగాస్టార్ గారిపై నా ప్రేమ‌ని చూపించే స‌మ‌యం వ‌చ్చేసింది. `లూసీఫ‌ర్‌` తెలుగు రీమేక్ కోసం మా జ‌ర్నీ ప్రారంభం కాబోతోంది` అంటూ ట్వీట్ చేశారు.

 

View this post on Instagram

 

A post shared by thaman S (@musicthaman)