మహేష్ చిత్రానికి బుక్కైన థమన్


మహేష్ చిత్రానికి బుక్కైన థమన్
మహేష్ చిత్రానికి బుక్కైన థమన్

ఈ మధ్య థమన్ టైమ్ ఏంటో అస్సలు తెలీట్లేదు. తనను వద్దనుకున్న వాళ్లంతా మళ్ళీ కావాలంటూ తిరిగి తన వద్దకే వస్తున్నారు. 2019 థమన్ కు భలే కలిసొచ్చింది. అన్నీ సూపర్ హిట్ పాటలు థమన్ నుండి వచ్చాయి. అల వైకుంఠపురములో గురించి చెప్పేదేముంది. ఆరు పాటలకు ఆరూ బ్లాక్ బస్టర్లు అందించాడు థమన్. దీనికి అల వైకుంఠపురములో టీమ్ మొత్తం ఫిదా అయిపోయారు. అందుకే నిన్నటి థాంక్స్ మీట్ లో సక్సెస్ కు ప్రధాన కారణం థమన్ అని అందరూ తేల్చిపడేసారు. ఒకే సినిమా నుండి రెండు పాటలు 100 మిలియన్ వ్యూస్ తెచ్చుకోవడం అంటే అది మాటలు కాదు. అల వైకుంఠపురములో అనే కాదు, రీసెంట్ గా వచ్చిన వెంకీ మామ, ప్రతిరోజూ పండగే, పాటలు విడుదలైన డిస్కో రాజా.. ఇలా అన్ని సినిమాల్లో థమన్ తన పాటలతో ఒక ఊపు ఊపుతున్నాడు.

ఒకప్పుడు నెం 2కే పరిమితమైపోయిన థమన్ ఇప్పుడు నెం 1 ప్లేస్ మీద దర్జాగా కూర్చున్నాడు. 2020 కూడా థమన్ కు భారీగానే కలిసొచ్చేలా ఉంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ సినిమాకు కమిటయ్యాడు. పింక్ రీమేక్ కు మ్యూజిక్ అందించేది థమన్. ఇక మహేష్ తో మూడు సినిమాలు చేసాక వరసగా ఐదారు సినిమాల పాటు అతని పేరు ఎత్తలేదు మహేష్.

అయితే ఇప్పుడు థమన్ ఫామ్ చూసి అప్రోచ్ అవ్వక తప్పలేదు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు చేయబోయే చిత్రానికి థమన్ సంగీత దర్శకుడిగా ఎంపికయ్యాడు. ఈ విషయం అధికారికంగా ప్రకటించకపోయినా ఇప్పటికే దీనికి సంబంధించిన మాటలు పూర్తైపోయినట్లు సమాచారం. త్వరలోనే మహేష్ 27వ చిత్ర మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలవుతాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం యూఎస్ ట్రిప్ వెళ్ళాడు. తిరిగి వచ్చిన తర్వాత ఫైనల్ స్క్రిప్ట్ విని ఓకే అంటే ప్రీ ప్రొడక్షన్ పనులు చకచకా మొదలైపోతాయి. ఇది ఒక గ్యాంగ్ స్టర్ బేస్డ్ సినిమా అని తెలుస్తోంది.