ఎన్టీఆర్ తమన్ కు ఛాన్స్ ఇస్తున్నాడా


ఎన్టీఆర్ తమన్ కు ఛాన్స్ ఇస్తున్నాడా

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్న విషయం తెలిసిందే . అయితే ఆ చిత్రానికి మొదట అనిరుద్ ని సంగీత దర్శకుడిగా ఎంపిక చేసారు కానీ అజ్ఞాతవాసి చిత్రం ఘోర పరాజయం పొందడంతో అనిరుద్ పై నీలినీడలు కమ్ముకున్నాయి . అజ్ఞాతవాసి చిత్రం ప్లాప్ కావడానికి అనిరుద్ సంగీతం కూడా కారణమని రకరకాల మాటలు వినిపించాయి దాంతో రెండో ఆలోచన చేస్తున్నట్లు గతకొంత కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి కానీ దానిపై మాత్రం ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు .

ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మార్చిలో ప్రారంభం కానుంది అప్పుడే అసలు సంగతి తెలుస్తారట . అనిరుద్ బదులు ఎస్ ఎస్ తమన్ ని తీసుకుంటే ఎలా ఉంటుంది అన్న ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది . ఇటీవల తమన్ అందించిన పాటలు హిట్ కావడంతో అనిరుద్ కు బదులుగా తమన్ ని తీసుకుందామని ఎన్టీఆర్ అంటున్నాడట ! మరి త్రివిక్రమ్ ఆలోచన ఎల్ ఉందో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే .