దేవి ప్లేస్ లో థమన్.. అంతా ఉత్తిదే!


thaman replacing devi for allu arjun sukumar film is trash
దేవి ప్లేస్ లో థమన్.. అంతా ఉత్తిదే!

ప్రస్తుతం థమన్ హాట్ ఫామ్ కంటిన్యూ అవుతోంది. సినిమా ఏదైనా తన ఆల్బమ్ ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటున్నాడు థమన్. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా తన పాటలు మాత్రం హిట్టైపోతున్నాయి. అందుకే ఇప్పుడు దర్శక నిర్మాతల హాట్ ఫేవరెట్ థమన్ అనడంలో సందేహం లేదు. సరిగ్గా థమన్ ఫామ్ రైజ్ అవుతున్న సమయంలో దేవి శ్రీ ప్రసాద్ డౌన్ అవ్వడం గమనార్హం. దశాబ్ద కాలంగా టాప్ ఫామ్ లో కొనసాగిన దేవి శ్రీ ప్రసాద్ గత కొంత కాలంగా ఫామ్ పరంగా ఇబ్బంది పడుతున్నాడు. రీసెంట్ గా అతను కంపోజ్ చేసిన ఆల్బమ్స్ కూడా సూపర్ హిట్ అయిన దాఖలాలు తక్కువే. ఈ నేపథ్యంలో సుకుమార్ – అల్లు అర్జున్ తో చేయబోయే సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ ను ఎంచుకోవడంతో కొత్త రూమర్స్ పుట్టుకొచ్చాయి.

తనకు అల వైకుంఠపురములో చిత్రంతో సూపర్ హిట్ ఆల్బమ్ ఇచ్చిన థమన్ ను ఈ సినిమాకు కూడా కంటిన్యూ చేయాలని అల్లు అర్జున్ పట్టుబట్టినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ విషయంలో బన్నీ, సుకుమార్ ఇద్దరి మధ్యా వాదనలు కూడా జరిగినట్లు వార్తలు అల్లేశారు. హీరో మాట కోసం సుకుమార్ కూడా థమన్ నే తీసుకుందామన్న నిర్ణయానికి వచ్చినట్లు రూమర్లు షికార్లు చేసాయి. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజాలు లేవని తెలుస్తోంది.

సుకుమార్ కు బన్నీ ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసినట్లు సమాచారం. సుకుమార్ సినిమాలు ప్లాపైనా కానీ ఆల్బమ్ ఏ రేంజ్ లో హిట్ అయిందో మనందరం చూసాం. దేవి ఎప్పుడూ సుకుమార్ సినిమా అంటే స్పెషల్ ఇంట్రెస్ట్ తో పనిచేస్తాడు. ఈ నేపథ్యంలో బన్నీ సినిమాకు కూడా అదిరిపోయే ట్యూన్స్ ను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మ్యూజిక్ సిట్టింగ్స్ పూర్తైపోయి దేవి మూడు పాటలను కూడా రికార్డ్ చేసేసినట్లు సమాచారం. పాటలు కూడా రికార్డ్ అయిపోయాక మ్యూజిక్ డైరెక్టర్ మార్పు అని రూమర్స్ ఎలా పుట్టిస్తారో అసలు!