సర్కారు వారి పాట.. థమన్ ఫుల్ క్లారిటీ


సర్కారు వారి పాట.. థమన్ ఫుల్ క్లారిటీ
సర్కారు వారి పాట.. థమన్ ఫుల్ క్లారిటీ

ఈ మధ్య థమన్ టైమ్ ఏంటో తనకే అర్ధం కావట్లేదు.. చేసిన ప్రతీ పాట హిట్ అయిపోతోంది. అల వైకుంఠపురములో చిత్రంతో కెరీర్ బెస్ట్ హిట్ ను అందుకున్నాడు థమన్. ఈ సినిమా ఆడియో పరంగా ఇండస్ట్రీ హిట్ అని చెప్పుకోవచ్చు. అన్ని పాటలు సూపర్ డూపర్ హిట్ గా నిలిచాయి. ఒకదాన్ని మించి ఒకటి సోషల్ మీడియాలో ప్రభంజనం సృష్టించాయి. థమన్ ఫుల్ ఫామ్ చూసి మహేష్ తన తర్వాతి చిత్రానికి మళ్ళీ అవకాశమిచ్చాడు. మహేష్ – థమన్ కాంబినేషన్ లో ఇప్పటివరకూ మూడు చిత్రాలు వచ్చాయి. దూకుడు, బిజినెస్ మ్యాన్, ఆగడు.. ఇలా మూడు చిత్రాలు ఆడియో పరంగా సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు మళ్ళీ 7 సంవత్సరాల తర్వాత మహేష్ – థమన్ కలిసి పనిచేస్తున్నారు.

పరశురామ్ దర్శకత్వంలో మహేష్ సర్కారు వారి పాట చేస్తున్న విషయం తెల్సిందే. థమన్ ఈ చిత్రాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. మహేష్ కు మరోసారి చార్ట్ బస్టర్ అందించాలని కసిగా ఉన్నాడు. అల వైకుంఠపురములో తర్వాత తన సక్సెస్ ను మరింత పైకి తీసుకెళ్లాలని చూస్తున్నాడు. సర్కారు వారి పాట సినిమా కోసం ఇటీవలే పరశురామ్ తో మ్యూజిక్ సిట్టింగ్ కూడా జరిగిందట. సర్కారు వారి పాట రాజకీయ నేపథ్యంలో సాగినా కానీ అన్ని రకాల అంశాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నాడట దర్శకుడు. దీంతో థమన్ కూడా మహేష్ కోసం అన్ని రకాల సాంగ్స్ ను కంపోజ్ చేసే అవకాశం లభించడంతో ఉత్సాహంగా వర్క్ కూడా స్టార్ట్ చేసినట్లు సమాచారం. మాస్ సాంగ్, రొమాంటిక్ సాంగ్స్ తో పాటు స్పెషల్ సాంగ్, మెసేజ్ సాంగ్ ఇలా అన్ని జోనర్లలో సాంగ్స్ ను కంపోజ్ చేయబోతున్నట్లు సమాచారం. మరి థమన్ ఈసారి ఎలాంటి చార్ట్ బస్టర్ ను అందిస్తాడో చూడాలి.