నయనతారకి మైనస్..తమన్నాకి కి ప్లస్ అయ్యింది…


నయనతారకి మైనస్..తమన్నాకి కి ప్లస్ అయ్యింది...
నయనతారకి మైనస్..తమన్నాకి కి ప్లస్ అయ్యింది…

‘సైరా నరసింహా రెడ్డి’ సినిమా రోజు రోజుకి జనాల దగ్గరికి రీచ్ అవుతుంది. పబ్లిసిటీ కూడా బాగా చేస్తున్నారు. సినిమా ఇంకో 2 రోజుల్లో రిలీజ్ అవుతుంది. మెగా అభిమానులే కాకుండా, సినిమా బాహుబలి, సాహో రికార్డ్స్ ని తిరగ రాయాలి అని అందరూ వేడుకుంటున్నారు.

ఇక తారాగణం విషాయానికి వస్తే, భారీ సినిమా కాబట్టి భారీ తారాగణం ఉంటుంది. అందులోనూ కథానాయికల విషయంలో వెనక్కి అడుగు వేయలేం అని ముందే సినిమా యూనిట్ అనగా సురేందర్ రెడ్డి, రామ్ చరణ్ “నయనతార“,”తమన్నా” లని సెలెక్ట్ చేసారు. ఇద్దరికి అన్ని పరిశ్రమలో మంచి పేరుంది, ఇదివరకే సినిమాలు బాగా హిట్ అయ్యాయి అని చెప్పొచ్చు. నయనతారకి మాత్రం అంతకు ముందు తీసిన ప్రతి సినిమా హిట్ అయ్యేవి తమిళంలో. అలా అవి తిరిగి తెలుగు, హిందీ లో డబ్బింగ్ లాగ రిలీజ్ చేసేవారు.

మరి నయనతారకి కథ చెప్పేటప్పుడు మీకే ఎక్కువ ప్రాధాన్యత అన్నారు, కానీ నయనతార ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది. చూసుకుంటే నయనతార ఇప్పటివరకు ప్రొమోషన్ కి రాలేదు, టీం తో కలవలేకపోయింది. ఆ అవకాశాన్ని తమన్నా దక్కించుకుంది. నిజానికి తమన్నా క్యారక్టర్ చిన్నది, నయనతార షూటింగ్ టైం లో కూడా సైరా టీం కి సహకరించకపోవడంతో లోటుపాట్లని తమన్నా చేత చేయించేవారంటా. అలా తమన్నాకి సినిమాలో పెద్ద అవకాశం లాగ తీసుకుంది.

దర్శక నిర్మాతలు కూడా తమన్నా రోల్ పెంచాలని నిర్యాయించుకొని పాత్ర పెంచేశారు. నిన్న చూసిన మొదటి వీడియో సాంగ్ లో కూడా తమన్నా పాత్రే ఎక్కువ ఉందని తెలిసిపోయింది. తమన్న సైరా టీం తో ప్రొమోషన్ కి కూడా బాగా సపోర్ట్ చేస్తూ ఉంది. అలా నయనతారకి మైనస్ అయ్యింది, తమన్నాకి ప్లస్ అయ్యింది. చూసుకుంటే తమన్నా గ్లామర్ కూడా సినిమాకి ప్లస్ అయ్యేలా ఉంది.