త‌మ్మారెడ్డి ప్రెడిక్ష‌న్ నిజ‌మౌతుందా?

త‌మ్మారెడ్డి ప్రెడిక్ష‌న్ నిజ‌మౌతుందా?
త‌మ్మారెడ్డి ప్రెడిక్ష‌న్ నిజ‌మౌతుందా?

గ‌త కొంత కాలంగా ద‌ర్శ‌క‌నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ త‌న యూట్యూబ్ చాన‌ల్ ద్వారా బిగ్ మూవీస్‌తో పాటు న‌చ్చిన అంశాల‌పై విశ్లేష‌ణ‌లు.. విమ‌ర్శ‌లు గుప్పిస్తూ వార్త‌ల్లో నిలుస్తున్న విష‌యం తెలిసిందే. తాజాగా ఆయ‌న `ఆర్ఆర్ఆర్‌` వీకెండ్ వ‌సూళ్ల‌పై జోశ్యం చెప్పారు. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఇద్ద‌రు స్టార్ హీరోలు యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ క‌లిసి న‌టిస్తున్న ఈ ఎపిక్ డ్రామా తొలి వారాంతంలో రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టే అవ‌కాశం వుంద‌న్నారు.

తొలి వారంతానికి `ఆర్ ఆర్ ఆర్‌` దాదాపుగా 500 కోట్లు వసూలు చేసి ఈ స్థాయిలో వ‌సూళ్ల వ‌ర్షం కురిపించిన చిత్రంగా రికార్డు కెక్క‌డం ఖాయం అని త‌మ్మారెడ్డి ప్రిడిక్ష‌న్ చెప్పారు. `బాహుబ‌లి 2` తొలి వారాంతానికి 400 కోట్ల‌కు మించి వ‌సూళ్ల‌ని సాధించి చ‌రిత్ర సృష్టించింది. ఆ చ‌రిత్ర‌ను `ఆర్ ఆర్ ఆర్` తిర‌గ‌రాస్తుంద‌ని త‌మ్మారెడ్డి జోశ్యం త‌న యూట్యూబ్ ఛాన‌ల్ లో వెల్ల‌డించడం ఆస‌క్తిక‌రంగా మారింది.

ఆర్ ఆర్ ఆర్‌` తొలి రోజు 200 కోట్లు ప్రారంభ వ‌సూళ్ల‌ని సాధిస్తుంద‌ని విడుద‌లైన‌ 3, 4 రోజుల్లో 500 కోట్లు కొల్ల‌గొడుతుంద‌ని అయితే సినిమా ర‌న్ మాత్రం మూవీ ఈ కంటెంట్ తో పాటు మౌత్ టాక్‌పై ఆధార‌ప‌డి వుంటుంద‌ని క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ మూవీపై పూర్తిగా కాన్ఫిడెంట్‌తో వున్నాన‌ని, ఈ మూవీ ఆల్ రికార్డ్స్‌ని తిర‌గ‌రాస్తుంద‌ని చెప్పుకొచ్చారు. త‌మ్మారెడ్డి `ఆర్ ఆర్ ఆర్‌`పై చెప్పిన విశ్లేష‌ణ ప్ర‌స్తుతం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.