న‌న్ను నేను కొత్త‌గా ఆవిష్క‌రించుకున్నా!Tharun bhasker neeku matrame cheptha
Tharun bhasker neeku matrame cheptha

యుంగ్, అండ్ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ త‌రుణ్‌భాస్క‌ర్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న టాక్ షో `నీకు మాత్ర‌మే చెప్తా`. పి.పి. ప్రొడ‌క్ష‌న్స్ ప్ర‌జా ప్ర‌భాక‌ర్, శ్రీ‌కాంత్ ఈ షోకు నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. శ‌ర‌త్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ ఈ నెల 14 నుంచి ఓ టీవి ఛాన‌ల్‌లో ప్రసారం కానుంది. ఈ సంద‌ర్భంగా టీమ్ మీడియా ముందుకొచ్చారు. ఒక సినిమా వెన‌క ఎన్ని క‌ష్టాలున్నాయి?, ఒక డైరెక్ట‌ర్ ప‌డే క‌ష్టం ఎలా వుంటుంది? అనేది ఈ షోలో చూపించాం. ఈ కాన్సెప్ట్ న‌చ్చి త‌రుణ్‌భాస్క‌ర్ ముందుకొచ్చారు. ద‌ర్శ‌కుడిగా మార‌డానికి ముందు త‌ను ప‌డిన క‌ష్టాల‌ని త‌రుణ్‌భాస్క‌ర్ వెల్ల‌డించార‌ని ప్ర‌జా భాస్క‌ర్ వెల్ల‌డించారు.

తొలిసారి హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న త‌రుణ్‌భాస్క‌ర్ మాట్లాడుతూ `న‌న్ను ఆద‌రిస్తున్న వారంద‌రికోసం మ‌రో కొత్త ప్ర‌య‌త్నంతో మీ ముందుకు వ‌స్తున్నాను. ఒక ద‌ర్శ‌కుడిగా మ‌రో ద‌ర్శ‌కుడిని ఇంట‌ర్వ్యూ చేయ‌డం అనేది కొత్త‌గా అనిపించింది. టెలివిజ‌న్‌లో ప్రోగ్రామ్ చేయ‌డం వ‌ల్ల కొత్త విష‌యాలు నేర్చుకున్నాను. ఈ షో న‌న్ను చాలా మార్చింది. న‌న్ను నేను కొత్త‌గా ఆవిష్క‌రించుకున్నా. ఇత‌ర డైరెక్ట‌ర్‌ల‌పై వున్న నా అభిప్రాయాలు మారాయి. ఇది తొలి సీజ‌న్‌. రీసెంట్‌గా స‌క్సెస్‌ల‌ని అందుకున్న‌ కొత్త ద‌ర్శ‌కుల‌ను కూడా ఈ షోలో ప‌రిచ‌యం చేయ‌బోతున్నాం` అన్నారు.

వెంక‌టేష్‌తో చేయ‌బోతున్న సినిమా గురించి వివ‌రిస్తూ ` వెంక‌టేష్‌గారితో చేయ‌బోయే ప్రాజెక్ట్  త్వ‌ర‌లోనే మొద‌ల‌వుతుంది. సురేష్ ప్రొడ‌క్షన్స్ నిర్మాణంలో ఇది వుంటుంది. నెట్ ఫ్లిక్స్ కోసం ఓ వెబ్‌సిరీస్ చేశాను. అందులో మంచుల‌క్ష్మి కీల‌క పాత్ర పోషించింది. ఆమెతో పాటు ఇందులో మేఘ‌నా శాన్వి ప‌రిచ‌యం అవుతోంది. ఆమెకు మంచి పేరొస్తుంది` అని వివ‌రించారు త‌రుణ్ భాస్క‌ర్‌.