మాస్ మహారాజా కోసం కామెడీను పెంచుతున్న దర్శకుడు


The director who is raising comedy for Mass Maharaja
The director who is raising comedy for Mass Maharaja

మాస్ మహారాజా రవితేజ సినిమాలంటే ఒకప్పుడు మినిమం గ్యారంటీ ఉండేది. ఈ హీరో నుండి సినిమా వస్తోందంటే కనీసం యావరేజ్ గానైనా ఉంటుంది అని అనుకునేవాళ్లు. అయితే ప్రస్తుతం రవితేజ కెరీర్ ఏమంతబాలేదు. ఈ హీరో నటించిన లాస్ట్ నాలుగు సినిమాలు దారుణంగా బెడిసికొట్టాయి. ఇందులో ఒక్క సినిమా కూడా కనీసం 50 శాతాన్ని మించి రికవర్ చేయలేకపోవడాన్ని బట్టి ఈ పరాజయాల స్థాయి ఎంతో అర్ధం చేసుకోవచ్చు. ఈ నాలుగు సినిమాలు అనే కాదు రవితేజ లాస్ట్ హిట్ రాజా ది గ్రేట్ కంటే ముందు సినిమాలు కూడా పరాజయం పొందాయి. దీంతో రవితేజ మార్కెట్ కు ఎసరు వచ్చింది. ఎలాగైనా హిట్ కొట్టాల్సిన పరిస్థితిలో పడ్డాడు రవితేజ.

అయితే ఇన్ని ప్లాపులు వస్తున్నా రవితేజకు వరస అవకాశాలు వస్తుండడం విశేషం. ఇప్పటికే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో క్రాక్ సినిమాను చేస్తోన్న రవితేజ, మరో సినిమాను కూడా లైన్లో పెట్టాడు. క్రాక్ సినిమా షూటింగ్ ఇప్పటికే మెజారిటీ భాగం పూర్తి చేసుకుంది. ఇటీవల విడుదల చేసిన టీజర్ చాలా ప్రామిసింగ్ గా అనిపించింది. రవితేజ మరోసారి పోలీస్ పాత్రలో రెచ్చిపోనున్నాడన్న సంకేతాల్ని ఇచ్చింది. ఈ సినిమా మే 8న విడుదలవుతుండగా, దీని తర్వాత రమేష్ వర్మ దర్శకత్వంలో సినిమాను చేయనున్నాడు రవితేజ. ఇది మరో పవర్ఫుల్ సబ్జెక్ట్ తో తెరకెక్కనుందని అర్ధమవుతోంది.

ఈ రెండు సినిమాలు కాకుండా లేటెస్ట్ గా రవితేజ మూడో సినిమాను కూడా లైన్లో పెడుతున్నాడు. రవితేజ హీరోగా త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో ఒక సినిమా త్వరలో అధికారిక ప్రకటనకు రానుంది. కామెడీను కలగలిపి రొమాంటిక్ లవ్ స్టోరీలు తీయడంలో నక్కిన స్టయిల్ వేరు. సినిమా చూపిస్త మావ, నేను లోకల్, హలో గురు ప్రేమ కోసమే వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న ఈ దర్శకుడు ప్రస్తుతం రవితేజ హీరోగా తెరకెక్కబోయే సినిమాలో కూడా కామెడీను ప్రధానంగా ఎంచుకోకున్నాడు. మరి ఈ సినిమాతో రవితేజ ఎలాంటి ఫలితాన్ని అందుకోనున్నాడో చూడాలి.