హీరోగా మారుతున్న మాస్ డైరెక్టర్


హీరోలు దర్శకులుగా మారడం , దర్శకులు హీరోలుగా మారుతున్న ఈరోజుల్లో దర్శకులు వివివినాయక్ హీరోగా నటించడానికి సిద్దం అవుతున్నాడు . తెలుగునాట సంచలన చిత్రాలకు దర్శకత్వం వహించిన వివివినాయక్ దర్శకులు శంకర్ శిష్యుడైన నరసింహరావు దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట . నరసింహరావు ఇంతకుముందు శరభ చిత్రానికి దర్శకత్వం వహించాడు . అయితే ఆ సినిమా పరాజయం పాలయ్యింది . అయినప్పటికి మళ్ళీ మెగా ఫోన్ పట్టడానికి , సక్సెస్ కొట్టడానికి సిద్దం అవుతున్నాడు .

ఇక వినాయక్ విషయానికి వస్తే దర్శకుడిగా తన కంటూ ఓ ముద్ర వేసుకున్న ఈ దర్శకుడు ఇక హీరోగా మారుతున్నాడు . అయితే హీరోగా మారిన దర్శకులలో సక్సెస్ అయ్యింది వేళ్ళ మీద లెక్కపెట్ట గలిగే వాళ్ళు మాత్రమే ! వినాయక్ మరి హీరోగా సక్సెస్ కొడతాడా ? లేదా ? అన్నది తెలియాలంటే ఆ సినిమా వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే .