ది లయన్ కింగ్ రివ్యూ


The Lion King Movie Review in Telugu
The Lion King Movie Review in Telugu

గొంతు అరువిచ్చిన వాళ్ళు : నాని , జగపతిబాబు , రవిశంకర్ , బ్రహ్మానందం , అలీ
సంగీతం : హన్స్ జిమ్మెర్
నిర్మాణం : డిస్నీ
దర్శకత్వం : జోన్ ఫావ్రియు
రేటింగ్ : 3.5/ 5 
రిలేస్ డేట్ : 19 జూలై 2019

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన డిస్నీ సంస్థ నిర్మించిన ప్రతిష్టాత్మక చిత్రం ” ది లయన్ కింగ్ ” . నాని , జగపతిబాబు , రవిశంకర్ , బ్రహ్మానందం , అలీ తదితరులు తమ గొంతులను అరువిచ్చిన చిత్రం ఈ ది లయన్ కింగ్ . మరి ఈ సినిమా ప్రేక్షకులను అలరించేలా రూపొందిందా ? లేదా ? అన్నది తెలియాలంటే కథ లోకి వెళ్లాల్సిందే .

కథ : 
అడవికి రారాజు అయిన సింహం ( ముఫార్ ) తన రాజ్యానికి తన వారసుడైన చిన్న సింహాన్ని ( సింబా ) రాజుగా చేయాలనీ అనుకుంటాడు అయితే అన్న తర్వాత అడవికి నేనే రారాజు కావాలని దురాలోచనతో ఉంటాడు ముఫార్ తమ్ముడు (స్కార్ సింహం ) . అయితే ఆ అడవికి రాజైన ముఫార్ సడెన్ గా చనిపోతాడు , దాంతో సింబా కూడా కనిపించకుండా పోతాడు ఇంకేముంది స్కార్ సింహం ఆ అడవికి రాజు అవుతాడు . కానీ ఇంతలోనే సింబా మళ్ళీ ఆ అడవి లోకి ఎంటర్ అవుతాడు . తన తండ్రి కోరిక మేరకు అడవికి రారాజు కావాలని అనుకుంటాడు . దాంతో స్కార్ సింహం కు సింబా కు పోరు మొదలౌతుంది . ఈ పోరులో సింబా విజయం సాధించాడా ? లేదా ? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే .

హైలెట్స్ : 
విజువల్స్
నాని
జగపతిబాబు
రవిశంకర్
బ్రహ్మానందం
అలీ
వాయిస్ లు

డ్రా బ్యాక్స్ : 
స్లో నెరేషన్

విశ్లేషణ : 
ముఫార్ పాత్రకు రవిశంకర్ గాత్రదానం చేయడంతో ఈ సినిమా స్థాయి పెరిగింది . డబ్బింగ్ ఆర్టిస్ట్ గా నటుడిగా రవిశంకర్ గొప్పతనం గురించి కొత్తగా చెప్పేదేముంది బొమ్మాలి అంటూ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు . సింహానికి తన గొంతు అరువిచ్చి భేష్ అనిపించాడు . అలాగే జగపతిబాబు కూడా స్కార్ సింహానికి వాయిస్ ఇచ్చాడు . ఒకప్పుడు ఈ జగపతిబాబు వాయిస్ ని విమర్శించినా వాళ్లే ఇప్పుడు అద్భుతం అని పొగుడుతున్నారు అంటే నిజంగా జగపతి బాబు తనని తాను మార్చుకున్న గొప్పతనమే ! ఇక సింబా కు నాని అదరహో అనిపించాడు . వీళ్ళ వాయిస్ లతో ప్రేక్షకులు చిత్రంలో లీనమై పోతారు . అలాగే బ్రహ్మానందం , అలీ లు కూడా నవ్వించే ప్రయత్నం చేసారు .

ఇక విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి , చిత్రీకరించిన తీరు కూడా చాలా బాగుంది . అయితే కథనం కాస్త వేగంగా ఉండి ఉంటే మరోలా ఉండేది .అంతర్జాతీయ సంస్థ  డిస్నీ గురించి కొత్తగా చెప్పేదేముంది . నిర్మాణ విలువలు బాగున్నాయి అలాగే డబ్బింగ్ పరంగా కూడా . నేపథ్య సంగీతం ఈ చిత్రానికి హైలెట్ గా నిలిచింది .

ఓవరాల్ గా : 
ది లయన్ కింగ్ అందరినీ అలరించే చిత్రం .