“అడిమురై” పోరాట కళ నేపధ్యంలో ధనుస్ “పట్టాస్”


The Official Trailer of PATTAS released
The Official Trailer of PATTAS released

ప్రయోగాత్మక నేపధ్యానికి, పక్కా మాస్ అంశాలు జోడించి సినిమాలు చెయ్యడంలో తమిళ్ స్టార్ ధనుష్ ది ఒక ప్రత్యేకమైన శైలి. తెలుగు ప్రేక్షకులు ఇంకా “తూటా” సినిమా మర్చిపోకముందే ఆయన తన కొత్త సినిమా ట్రైలర్ ను ప్రేక్షకుల ముందుకి తెచ్చారు. ఆ కొత్త సినిమా పేరు “పట్టాస్”. ఒక్కరోజులోనే సుమారు 4 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది ఆ సినిమా ట్రైలర్. ఇంతకీ ఆ సినిమా విశేషాల్లోకి వెళ్తే

“మనకు ఏదీ మంచిదో మనకంటే బాగా మనల్ని పుట్టించిన మట్టికే బాగా తెలుసు” అనే డైలాగ్ తో మొదలవుతుంది. ఈ సినిమాలో ధనుష్ డబల్ యాక్షన్ అనుకోవచ్చు. ప్రధానంగా ఈ సినిమాలో “అడిమురై” అనే ప్రాచీన పోరాట కళను చూపించారు. హీరో పోరాట యోధుడు. సంగీత ఒకానొక పాత్రలో కనిపిస్తుంది, ఇక ఒక కీలక పాత్రలో నాజర్ గారు యాక్ట్ చేస్తున్నారు. తెలుగు హీరో నవీన్ చంద్ర ఈ సినిమాలో విలన్ పాత్రలో కనిపిస్తున్నారు. కిక్ బాక్సింగ్ లో తన కొడుకుకి ఎవరూ పోటీ రాకూడదనే ఆయన డైలాగ్ తో పాటు, “ఏంట్రా… వెనకాల దాక్కోవదమేనా రా .. అడిమురై అంటే..” అనే డైలాగ్ చూడవచ్చు.

ఇక హీరో ధనుష్ మార్క్ కామెడీ అంశాలు. లవ్ సీన్లు కూడా సినిమా నిండా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వైరల్ అయిన “చిల్ బ్రో” పాటతో పాటు, ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే హీరో గతం తాలూకు సీన్లు ట్రైలర్ లో ఉన్నాయి.

ఇక చివరగా ధనుష్ కి బాగా వర్కౌట్ అయిన తండ్రి పంచ్ డైలాగ్ “పేరు వెనుక మన తండ్రి పేరు పెట్టుకోవడం పెద్ద గొప్ప కాదు.. మన తండ్రి గొప్పతనానికి తగ్గట్లు జీవించడమే నిజమైన పేరు” కనిపిస్తుంది. ఈ సినిమాకు వివేక్ – మెర్విన్ సంగీతం అందిస్తున్నారు. ఇక డైరెక్టర్ దురై సెంథిల్ కుమార్ గారి విజన్ మనంకు అడుగడుగునా కనిపిస్తుంది. ధనుష్ కెరియర్ లో ఈ సినిమా ఒక మైల్ స్టోన్ అవుతుందని ఆశించవచ్చు.