దేశానికీ దొరికిన కొత్త నాయకుడు

The real hero Sonu Sood great leader in india sonu sood helping nature
The real hero Sonu Sood great leader in india sonu sood helping nature

ప్రపంచవ్యాప్తంగా గత సంవత్సరకాలంగా కరోనా మహమ్మారి కలవరపెడుతూనే ఉంది. తగ్గినట్టే తగ్గి సెకండ్ వేవ్ తో భారత దేశాన్ని గజ గజ వణికిస్తోంది. పట్నం, పల్లె అని తేడాలేకుండా అన్ని చోట్ల Cases పెరిగిపోతున్నాయి.

సహజంగా కష్టాలలో ఉన్నప్పుడు దేవుని గుర్తు చేసుకోవ‌డం అందరికి అలవాటే. “ఏ దిక్కూ లేని వారికి దేవుడే దిక్కు అంటూ ఉంటారు. కానీ ఏ దిక్కు లేకుండా ప్ర‌స్తుతం క‌రోనా మ‌హ‌మ్మారి చాల మంది ప్రాణాలు తీస్తోంది.
ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు చేతులు కాలాక ఆకులు ప‌ట్టుకున్నట్టు చ‌ర్య‌లున్నాయ‌నే విమ‌ర్శ‌లు కూడా ఉన్నాయి.
ముఖ్యంగా కేంద్రం ప్రభుత్వం Failure వల్లే దేశం ఓ పెద్ద Problem ను ఎదుర్కోవాల్సి వ‌చ్చింద‌నే ఆరోప‌ణ‌లు అంత‌కంత‌కూ పెరుగుతున్నాయి.
ఈ ప‌రిస్థితుల్లో ప్ర‌ముఖ న‌టుడు Sonu Sood లాంటి వ్యక్తి మ‌న దేశ పాల‌కుడై ఉంటే ఎంత బాగుండేదో అనే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఎందుకంటే వ్య‌క్తిగా ఆయ‌న అందిస్తున్న సేవ‌లు అద్భుతం అని చెప్ప‌క త‌ప్ప‌దు.

గత ఏడాది కరోనా మహమ్మారి వల్ల కష్టపడుతున్నవారి కి ప్రభుత్వం కంటే సోను సూద్ నిస్వార్థంగా పేదవారి కోసం బాగా పని చేసి Real hero అనిపించుకున్నారు. అలాంటి మంచి మ‌న‌సు క‌లిగిన ఆయ‌న దేశ పాల‌కుడై అయి ఉంటే …మ‌రెన్ని విధాలుగా అండ‌గా నిలిచే వారో క‌దా అని Sonu Sood గురించి ఇప్పుడు ఎక్క‌డ చూసినా చ‌ర్చ జ‌రుగుతోంది.

ఈ మధ్యనే సోను సూద్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న కరోనా రోగిని ప్రత్యేక చికిత్స కోసం నాగ్‌పూర్ నుండి హైదరాబాద్‌కు ఎయిర్ అంబులెన్స్‌ విమానంలో పంపించడం జరిగింది. వ్యక్తి గా తన సేవలు చాలా హర్షించదగ్గ విషయమే

తాజాగా Sonu Sood నుంచి ట్వీట్ ఆయ‌న‌పై ప్ర‌జాభిమానాన్ని మ‌రింత పెంచింది. ఆ ట్వీట్ ఏంటంటే

‘అర్ధరాత్రి మీకోసం ఎన్నో ఫోన్‌కాల్స్ చేస్తున్నాను. అవసరమైన వారికి పడకలు, ప్రాణవాయువు దొరకడంతో పాటు కొద్దిమంది ప్రాణాలైనా కాపాడగలిగితే.. అది రూ.100 కోట్ల చిత్రంలో పని చేయడం కంటే లక్షల రెట్లు ఎక్కువ సంతృప్తినిస్తుంది. పేదలు పడకల కోసం ఆస్ప‌త్రుల ముందు ఎదురు చూస్తుంటే నేను హాయిగా నిద్రపోలేను’

అని త‌న ఆవేద‌నను Twitter లో తెలిపారు.

సోను సూద్ సేవలు చూస్తుంటే మనకి Mother Therasa గుర్తుకు వస్తుంది. Mother Therasa స్ఫూర్తిదాయ‌క సందేశానికి నూటికి నూరుపాళ్లు న్యాయం చేస్తున్న వ్య‌క్తి సోనూసూద్ అని చెప్ప‌క త‌ప్ప‌దు.

మ‌న‌కేదో సాయం చేస్తార‌ని ఎన్నుకున్న ప్ర‌జాప్ర‌తినిధులు ఏమీ చెయ్యక పోవడం మనం గ‌మ‌నించొచ్చు.

ప్రాంతం, కులం, మ‌తం తేడాలు లేకుండా పేద‌రికం మరియు నిస్స‌హాయ‌త లో ఉన్నవారందరికి Sonu Sood సహాయం చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్ప‌టికే ఆయ‌న నుంచి దేశ వ్యాప్తంగా చాలా మంది సాయం పొందారు.

‘అందరికీ సాయం చేయలేకపోతున్నాను.. నా నుంచి సాయం అందనివారు క్షమించాలి’ అన్న మాటలు ఆయ‌న సంస్కారం గురించి ఎంత చెప్పినా త‌క్కువే.

ప్ర‌స్తుతం దేశాన్ని ఏలుతున్న నాయ‌కుల‌తో పోల్చితే …ఏ పదవి లేని Sonu Sood సహాయం చూస్తుంటే , అతనికి పదవి ఉంటే ఇంకెన్ని చేసేవారో క‌దా అనే అభిప్రాయం క‌ల‌గ‌క‌మాన‌దు.