వాజ్ పేయి ఎందుకు పెళ్లి చేసుకోలేదో తెలుసా


the untold love story of atal bihari vajpayeeఅటల్ బిహారి వాజ్ పేయి పెళ్లి చేసుకోకుండా ఆజన్మాంత బ్రహ్మచారి గా ఎందుకున్నాడో తెలుసా ……. లేలేత వయసులో తనకు నచ్చిన అమ్మాయిని ప్రేమించి ఆ ప్రేమని సఫలం చేసుకోకపోవడమే కారణం . కళాశాలకు వెళుతున్న రోజుల్లో తన తోటి విద్యార్ధి అయిన రాజ్ కుమారి ని తొలిచూపులోనే ప్రేమించాడట ! అయితే ఆమెకు తన ప్రేమ విషయం చెప్పే ధైర్యం చేయలేకపోయాడు కానీ ఆలోచన వచ్చిందే తడవుగా ప్రేమలేఖ రాసి ఆమె పుస్తకంలో పెట్టాడట . అసలే వాజ్ పేయి కవితలను అద్భుతంగా రాసే వ్యక్తి కావడంతో అటల్ ప్రేమలేఖ కు ఫిదా అయ్యిందట రాజ్ కుమారి . అయితే ఈ ప్రేమ విషయం రాజ్ కుమారి ఇంట్లో తెలియడంతో ఒకే కులానికి చెందినవాళ్లు అయినప్పటికీ పెళ్ళికి నిరాకరించారట ! దాంతో చేసేదిలేక తన ప్రేమని తనలోనే దాచుకున్నాడు .

అయితే ప్రేమలో విఫలం కావడంతో భగ్న ప్రేమికుడిగా మారకుండా రాజకీయాలపై ఆసక్తి మలుచుకున్నారు కాలక్రమంలో భారతదేశం గర్వించతగ్గ వ్యక్తిగా రూపాంతరం చెందాడు . కట్ చేస్తే దేశ రాజధాని ఢిల్లీ లో మళ్ళీ రాజ్ కుమారి భర్త అటల్ కు పరిచయం కావడం తో ఆ కుటుంబ సన్నిహితుడిగా మారాడు . రాజ్ కుమారి భర్త చనిపోయాక అటల్ నీడలోనే రాజ్ కుమారి తనువూ చాలించింది . ఇక ఈరోజు అటల్ బిహారి వాజ్ పేయి దహన సంస్కారాలు నిర్వహించింది రాజ్ కుమారి కూతురు నమిత కావడం విశేషం . నమిత ని దత్తత తీసుకున్నాడు అటల్ బిహారి వాజ్ పేయి . ప్రేమ పేరుతో విచ్చలవిడిగా ఎంతమందిని పడితే అంతమంది ని ప్రేమిస్తున్న ఈరోజుల్లో అటల్ బిహారి వాజ్ పేయి లాంటి అసలు సిసలైన ప్రేమికుడు ఎవరికి దొరుకుతాడు .

English Title: the untold love story of atal bihari vajpayee