సన్నీలియోన్ బయోపిక్ కూడా రెడీ


the untold story of sunny leone web series ready పోర్న్ స్టార్ సన్నీలియోన్ బయోపిక్ రెడీ అయ్యింది , అయితే ఇది వెండితెర పై కాకుండా వెబ్ సిరీస్ గా రానుంది . ఈనెల 16న ” కరణ్ జీత్ కౌర్ – ది అన్ టోల్డ్ స్టోరీ ఆఫ్ సన్నీలియోన్ ”అనే టైటిల్ తో ప్రసారం కానుంది , ఇక ఈ వెబ్ సిరీస్ ఓ ఆంగ్ల ఛానల్ లో ప్రసారం కానుంది . సన్నీ లియోన్ పోర్న్ స్టార్ గా మారే సమయం నుండి పోర్న్ స్టార్ గా మారిన మొదట్లో ఆమె అనుభవించిన మానసిక సంఘర్షణ ఈ వెబ్ సిరీస్ కి ప్రాణం పోస్తుందని సన్నీ లియోన్ 12 – 15 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఏం చేసింది అన్నది చూపించే ప్రయత్నం చేసాడు దర్శకుడు . కాగా ఆ పాత్రని రసా సౌజాని పోషించింది .

మరో విశేషం ఏంటంటే ఈ బయో పిక్ లో సన్నీ లియోన్ నటించడం విశేషం . పోర్న్ స్టార్ గా సన్నీ లియోన్ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే . పోర్న్ సినిమాలను వదిలేసి బాలీవుడ్ లో ప్రవేశంచి ఇక్కడ కూడా సత్తా చాటింది . ఒక్క బాలీవుడ్ చిత్రాల్లోనే కాకుండా తెలుగు , తమిళ్ , కన్నడ చిత్రాల్లో కూడా నటించింది సన్నీ లియోన్ . బయోపిక్ లు ప్రభంజనం సృష్టిస్తున్న ఈ సమయంలో సన్నీ లియోన్ బయోపిక్ ఎలాంట్ ఫలితాన్ని సాధిస్తుందో చూడాలి .

English Title: the untold story of sunny leone web series ready