అల్లు అర్జున్ బ్యాడ్ డాడీగా ఎందుకు మారిపోయాడు!


Third single teaser from Ala Vaikunthapurramulo is out
Third single teaser from Ala Vaikunthapurramulo is out

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం అల వైకుంఠపురములో సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఎప్పుడూ లేనిది అల వైకుంఠపురములో విషయంలో టీమ్ చాలా అగ్రసివ్ గా ముందుకెళ్తోంది. కనీవినీ ఎరుగని రేంజ్ లో ప్రమోషన్స్ చేస్తూ కుమ్మి అవతలేస్తోంది. ఈ చిత్రంలోని మొదటి రెండు పాటలు ఇప్పటికే విడుదలవ్వగా అవి శ్రోతలను ఒక ఊపు ఊపుతున్నాయి. సామజవరగమన ఎవరూ ఊహించని రీతిలో 80 మిలియన్ వ్యూస్ ను దాటేసింది. ఇక రెండో పాట రాములో రాముల కూడా 50 మిలియన్ వ్యూస్ కు చేరువైంది. ఇలా రెండు పాటలతోనే 130 మిలియన్ వ్యూస్ సాధించడం అనేది ఒక రికార్డుగా చెప్పుకోవచ్చు. ఈ రెండు పాటలు చాలా క్యాచీగా ఉండడంతో శ్రోతలు ఫస్ట్ టైమ్ విన్న వెంటనే కనెక్ట్ అవగలుగుతున్నారు.

ఈ రెండు పాటలు హల్చల్ చేస్తున్నాయంటే ఇప్పుడు మూడో పాట కూడా వచ్చింది. ఈరోజు బాలల దినోత్సవం సందర్భంగా అల వైకుంఠపురములో చిత్రంలోని మూడో పాట ఓ మై గాడ్ డాడీ టీజర్ ను విడుదల చేసారు. ఈ టీజర్ లో ఒక సర్ప్రైజ్ ఉంటుందని చెప్పగానే అందరూ ఈజీగా అల్లు అర్జున్ పిల్లలు అల్లు అయాన్, అల్లు అర్హ కనిపించబోతున్నారని గెస్ చేసారు. అందరూ అనుకున్నట్లుగానే ఈ పాట టీజర్ లో వీళ్ళిద్దరూ కనిపించారు.

“ఓ మై గాడ్ డాడీ జస్ట్ డోంట్ బీ మై బ్యాడీ.. ఓ మై గాడ్ డాడీ జస్ట్ డోంట్ బీ మై బ్యాడీ డోంట్ బీ సో హార్డీ దట్ విల్ మేక్ మీ సాడీ” అంటూ సాగే లిరిక్స్ ఆంగ్లంలో ఉన్నా సింపుల్ గా క్యాఛీగా ఉన్నాయి. ఇక ఈ వీడియో టీజర్ మొదట్లోనే అల్లు అర్జున్ గురించి అయాన్ ఫీలింగ్ అని వేసి.. అక్కడ అల్లు అర్జున్ స్మైల్ తో ఉన్న స్టాండీ ఒకటి పెట్టి దానివైపు అయాన్ అండ్ అర్హ కోపంగా చూడడం, అయాన్ మాటిమాటికీ తలకొట్టుకోవడం, ఇద్దరూ కలిసి ఆ స్టాండీని కొట్టడం, మధ్యలో అయాన్ ఒక స్టెప్ ట్రై చేయడం ఇవన్నీ చాలా క్యూట్ గా అనిపించాయి. అసలు అల్లు అర్జున్ ఇంతలా పిల్లలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నాడు అంటూ సోషల్ మీడియాలో సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు.

ఇక పాట విషయానికి వస్తే కృష్ణ చైతన్య ఈ పాటను రాయగా రోల్ రైడా, రాహుల్ సిప్లిగంజ్, బ్లేజి, రాహుల్ నంబియార్, రాబిట్ మాక్. థమన్ మరోసారి క్యాచీ ట్యూన్ తో మన ముందుకు వచ్చిన విషయం అర్ధమైపోతుంది. ఫుల్ సాంగ్ ను నవంబర్ 22న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. మరి ఈ ఓ మై గాడ్ డాడీ ఎటువంటి సంచలనాలని సృష్టిస్తుందో చూడాలి.

పూజ హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో నివేద పేతురాజ్, సుశాంత్, నవదీప్, టబు కీలక పాత్రలు పోషించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరి 12న విడుదల కాబోతోంది.