ఆర్ ఆర్ ఆర్ లో ఆ సీక్వెన్స్ అద్భుతం అంటున్నారే!


ఆర్ ఆర్ ఆర్ లో ఆ సీక్వెన్స్ అద్భుతం అంటున్నారే!
ఆర్ ఆర్ ఆర్ లో ఆ సీక్వెన్స్ అద్భుతం అంటున్నారే!

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా భారీ చిత్రం ఆర్ ఆర్ ఆర్. ఈ చిత్రానికి రౌద్రం రణం రుధిరం అనే కొనసాగింపుని ఇచ్చారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ చిత్రంలో హీరోలుగా నటిస్తున్న సంగతి తెల్సిందే. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలోనూ, ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలోనూ నటిస్తున్న ఈ సినిమా ఫిక్షనల్ పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతుంది. ఎందుకంటే ఆర్ ఆర్ ఆర్ లో రామరాజు, భీమ్ పాత్రలు స్నేహితులుగా కనిపిస్తారని టాక్. అయితే నిజ జీవితంలో ఈ రెండు పాత్రలు ఒకరికొకరు ఎదురుపడిన దాఖలాలు కూడా లేవు. చరిత్రలో లేని ఈ పాయింట్ మీదే రాజమౌళి తన సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

ఆర్ ఆర్ ఆర్ లో జక్కన్న ఎన్నో హైలైట్స్ పొందుపరుస్తుండగా మెయిన్ హైలైట్ గా మాత్రం ఈ ఇద్దరి పాత్రల మధ్య వచ్చే సీక్వెన్స్ అనే తెలుస్తోంది. రామరాజు, భీమ్ పాత్రలు రెండూ కూడా ఒకరికొకరు తీసిపోని పాత్రలుగా ఉంటాయి. ఒకరు నిప్పు, మరొకరు నీరుగా ప్రతిబింబిస్తారు. ఇద్దరికీ ఇద్దరూ ధీటైన వారే. మరి ఈ ఇద్దరూ కలిస్తే ఏమవుతుంది అన్న పాయింట్ జక్కన్న అద్భుతంగా తెరకెక్కిస్తున్నాడని సమాచారం.

ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ 75 శాతానికి పైగా పూర్తయింది. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా షూటింగ్ జరగట్లేదు. అయితే విఎఫ్ఎక్స్ పనులు ఎక్కువగా ఉన్న ఈ చిత్రం జనవరిలో విడుదలయ్యే అవకాశాలు లేవు. ఈ విషయాన్ని నిర్మాత దానయ్య ధృవీకరించారు. 2021 సమ్మర్ లో ఈ సినిమా తెరకెక్కే అవకాశాలు ఉన్నాయి.