ఈలలతో గోలలతో దద్దరిల్లిపోతున్న థియేటర్లు


ఆంద్రప్రదేశ్ , తెలంగాణ లలోని థియేటర్లు మహేష్ బాబు అభిమానుల ఈలలతో గోలలతో దద్దరిలిపోతున్నాయ్. ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా మహర్షి చిత్రం భారీ ఎత్తున విడుదలైన విషయం తెలిసిందే. రెండు రాష్ట్రాలలో కూడా మహర్షి చిత్రానికి ప్రత్యేక అనుమతి లభించడంతో ఉదయం ఆరు గంటలకె కొన్ని చోట్ల స్పెషల్ షోలు పడ్డాయి.

ఇక ఆ థియేటర్ లలో మహేష్ బాబు అభిమానుల ఈలలతో గోలలతో ఠారెత్తి పోతున్నాయి. మహేష్ బాబు తెరమీద కనబడగానే విజిల్స్ తో థియేటర్లు దద్దరిల్లి పోతున్నాయి. మహేష్ అభిమానులతో రెండు తెలుగు రాష్ట్రాలలో సందడి నెలకొంది. ఇక సినిమాకు సూపర్ హిట్ టాక్ రావడంతో కూడా మహేష్ ఫ్యాన్స్ లో మరింత జోష్ పెరిగింది.