డిజిట‌ల్ ప్ర‌పంచంలోకి ఆ ముగ్గురు!

డిజిట‌ల్ ప్ర‌పంచంలోకి ఆ ముగ్గురు!
డిజిట‌ల్ ప్ర‌పంచంలోకి ఆ ముగ్గురు!

డిజిట‌ల్ ప్ర‌పంచం ఇప్పుడు సినిమాని శాసిస్తోంది. థీయేట‌ర్‌కు రాని ప్రేక్ష‌కుడు మొమైల్ ఫోన్ వ‌చ్చిన త‌రువాత అర‌చేతిలోనే వినోదం అభిస్తుండ‌టంతో అక్క‌డే ఎంజాయ్ చేస్తూ డిజిట‌ల్ ప్ర‌పంచంలోనే మునిగితేలుతున్నాడు. రానున్న రోజుల్లో ఇది మ‌రింత విస్తృతం అయ్యే అవ‌కాశాలు క‌నిపిస్తుండ‌టం, ఇప్ప‌టికే బాలీవుడ్‌లోకి నెట్‌ఫ్లిక్స్‌, ఆమెజాన్ ప్రైమ్ భార‌తీయ మార్కెట్‌లోకి చొచ్చుకురావ‌డంతో దీంతో సినిమా వాళ్లు కూడా అటు వైపుగా అడుగులు వేయ‌డం మొద‌లుపెట్టారు.

ఇప్ప‌టికే జీ5, ఆమెజాన్ ప్రైమ్ టాలీవుడ్‌లో పాగా వేయాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తోంది. దానికి అడ్డుక‌ట్ట‌వేయాల‌ని మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ `ఆహా` పేరుతో డిజిట‌ల్ ప్లాట్ పామ్ ని ప్రారంభించిన విష‌యం తెలిసిందే. ఈ ప్లాట్ ఫామ్‌లోకి ముగ్గురు క్రేజీ ద‌ర్శ‌కులు ఎంట‌ర్ కాబోతున్నారు. `విరాట‌ప‌ర్వం` చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న వేణు ఊడుగుల ఇప్ప‌టికే అల్లు అర‌వింద్‌తో ఓ వెబ్ సిరీస్‌కి ఒప్పందం కుదుర్చుకున్నాడ‌ట‌. ఇదే వ‌రుస‌లో సుకుమార్‌, సుధీర్‌వ‌ర్మ కూడా చేర‌బోతున్నారు.

ఈ ముగ్గురూ క‌లిసి `ఆహా` కోసం వ‌రుస వెబ్ సిరీస్‌ల‌ని చేయ‌బోతున్నార‌ట‌. దీని కోసం ఇప్ప‌టికే భారీ ఒప్పందం కుదుర్చుకున్నార‌ని, త్వ‌ర‌లోనే వీటికి సంబంధించిన పూర్తి వివ‌రాలు బ‌య‌టికి రానున్న‌ట్టు తెలిసింది. `ఆహా`కు విజ‌య్ దేవ‌ర‌కొండ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న విష‌యం తెలిసిందే.