శ‌ర్వా కోసం  ముగ్గురు హీరోలు వ‌చ్చేస్తున్నారు!

శ‌ర్వా కోసం  ముగ్గురు హీరోలు వ‌చ్చేస్తున్నారు!
శ‌ర్వా కోసం  ముగ్గురు హీరోలు వ‌చ్చేస్తున్నారు!

టాలీవుడ్‌లో  హీరోల‌ ఫ్యాన్స్ మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు వున్నా హీరోల మ‌ధ్య మాత్రం మంచి స్రేహ భావం నెల‌కొన్న విష‌యం తెలిసిందే. ఓ హీరో ఫంక్ష‌న్‌కి మ‌రో హీరో వెళుతున్నారీమ‌ధ్య‌. ట్రైల‌ర్‌లు, టీజ‌ర్‌లు, లిరిక‌ల్ వీడియోస్‌ని రిలీజ్ చేస్తూ త‌మ మ‌ధ్య వున్న అనుబంధాన్ని చాటుకుంటున్నారు. తాజాగా హీరో శ‌ర్వానంద్ కోసం ముగ్గుకు క్రేజీ హీరోలు క‌లిసి వ‌స్తున్నారు. అదీ ట్రైల‌ర్ రిలీజ్ కోసం. శ‌ర్వానంద్ న‌టిస్తున్న తాజా చిత్రం `శ్రీ‌కారం`. కిషోర్ .బి ద‌ర్శ‌‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్న ఈ చిత్రాన్ని 14 ప్ల‌స్ రీల్స్ బ్యాన‌ర్‌పై రామ్ ఆచంట‌, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్నారు.

`గ్యాంగ్ లీడ‌ర్‌` ఫేమ్ ప్రియాంక అరుల్ మోహ‌న్ ఇందులో హీరోయిన్‌గా న‌టిస్తోంది. వ్య‌వ‌సాయం ప్ర‌ధ‌నాంశంగా కుటుంబ విలువ‌ల్ని, తండ్రీ కొడుకుల అనుబంధాన్ని జోడించి ఓ అంద‌మైన దృశ్య‌కావ్యంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు.  మిక్కీ జె. మేయ‌ర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర గీతాలు ఇప్ప‌టికే చార్ట్‌బ‌స్ట‌ర్స్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతున్నాయి. ఇటీవ‌లే శ్రీ‌కారం టైటిల్ సాంగ్‌ని రిలీజ్ చేశారు.

ఈ రోజు సాయంత్రం 6 గంట‌ల‌కు  చిత్ర ట్రైల‌ర్‌ని రిలీజ్ చేయ‌బోతున్నారు. విశేషం ఏంటంటే ట్రైల‌ర్‌ని సాధార‌ణంగా ఒక హీరో రిలీజ్ చేస్తారు. కానీ ఈ మూవీ ట్రైల‌ర్‌ని ముగ్గురు క్రేజీ హీరోలు రిలీజ్ చేయ‌బోతున్నారు. ఆ హీరోలు నేచుర‌ల్ స్టార్ నాని, వ‌రుణ్‌తేజ్‌, నితిన్‌. సినిమాలో వున్న సందేశం మ‌రింత మందికి చేరువ కావాల‌న్న ఉద్దేశంతో ఈ చిత్ర ట్రైల‌ర్ కోసం ఈ ముగ్గురు హీరోలు ట్రైల‌ర్ ని రిలీజ్ చేయ‌డానికి ముందుకొస్తున్నారు. కాగా వ్య‌వ‌సాయం ప్ర‌ధానాంశంగా రూపొందుతున్న ఈ మూవీ ఈ నెల 11న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.