కరుణానిధి కి ముగ్గురు భార్యలు


three marriages in karunanidhis lifeతమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కి ముగ్గురు భార్యలు . పద్మావతి పెద్ద భార్య కాగా దయాలు అమ్మళ్ రెండో భార్య, ఇక మూడో భార్య రజతీ అమ్మల్ . ఈ ముగ్గురికి ఆరుగురు సంతానం , పెద్ద భార్య పద్మావతి అమ్మల్ కు ఎం కె ముత్తు సంతానం కాగా పెద్ద భార్య పద్మావతి 1948 లోనే కన్నుమూశారు. ఇక రెండో భార్య దాయాలు అమ్మాళ్ కు పుట్టినవాళ్ళు అళగిరి , స్టాలిన్ , తమిళరసు ముగ్గురు కొడుకులు కాగా ఒక కూతురు సెల్వి . ఇక మూడో భార్య రజతీ అమ్మాళ్ కూతురే కనిమొళి . పార్లమెంట్ సభ్యురాలు గా కొనసాగుతున్న కనిమొళి ప్రతిభాషాలి గా గుర్తింపు తెచ్చుకుంది. మొత్తం కరుణానిధి కి ముగ్గురు భార్యలు కాగా ఆరుగురు సంతానం అందులో నలుగురు కొడుకులు ఇద్దరు కూతుర్లు .

కరుణానిధి 60 వ సంవత్సరం లో మూడో భార్య ను చేసుకోవడం విశేషం. సినీరంగంలో రచయితగా ప్రభంజనం సృష్టించి , రాజకీయ రంగంలో ప్రవేశించి అన్నాదురై మరణించడంతో డీఎంకే సారధ్య బాధ్యతలను నిర్వహించడమే కాకుండా ఏకఛత్రాధిపత్యంతో దాదాపు 60 ఏళ్ళు రాజకీయ రంగంలో ఉన్న అపార అనుభవం కలిగిన నాయకుడు కరుణానిధి. ఏ రంగంలో ప్రవేశిస్తే ఆ రంగంలో అనితర సాధ్యమైన విజయాలను సొంతం చేసుకున్నాడు కరుణానిధి. ఇక ఈ మహనాయకుడి అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం చెన్నై లోని మేరీనా బీచ్ లో జరుగనున్నాయి.

English Title: three marriages in karunanidhis life