మూడు సినిమాలలో హిట్ కొట్టేది ఏదో ?


brochevarevarura and kalki
brochevarevarura and kalki

రేపు మూడు సినిమాలు విడుదల అవుతున్నాయి అయితే మూడు సినిమాల్లో విజయం సాధించేది ఏదో ? అన్నది తెలియాలంటే మరికొద్ది గంటలు ఎదురు చూడాల్సిందే . సీనియర్ హీరో డాక్టర్ రాజశేఖర్ హీరోగా నటించిన కల్కి చిత్రం తో పాటుగా నివేదా థామస్శ్రీవిష్ణు నటించిన బ్రోచేవారెవరురా , కెప్టెన్ రానా ప్రతాప్ చిత్రాలు విడుదల అవుతున్నాయి

అయితే ఇందులో కల్కి , బ్రోచేవారెవరురా చిత్రాలపై ఆసక్తి నెలకొంది . రెండు చిత్రాలు కూడా టీజర్, ట్రైలర్ లతో ఆకట్టుకున్నాయి . దాంతో రెండు సినిమాలపై అంచనాలు నెలకొన్నాయి . అయితే అంచనాలను అందుకునేలా సినిమాలు ఉన్నాయా ? లేదా ? అన్నది రేపు తేలిపోనుంది . రాజశేఖర్ కు కల్కి తప్పనిసరిగా హిట్ కావాల్సి ఉంది ఎందుకంటే ఇది హిట్ అయితేనే గరుడ వేగ 2 సెట్స్ మీదకు వెళ్తుంది అలాగే ఇతర సినిమాలు లైన్ లోకి వస్తాయి లేదంటే కెరీర్ అగమ్య గోచరమే