మహేష్ బాబు మూడు షేడ్స్ లలో కనిపిస్తాడట


Three shades of Mahesh babu in Maharshi

మహేష్ బాబు తాజాగా మహర్షి చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే . వంశీ పైడిపల్లి దర్శకత్వంలో అశ్వనీదత్ , దిల్ రాజు , పివిపి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు . కాగా ఈ చిత్రంలో మహేష్ బాబు మూడు విభిన్న గెటప్ లలో కనిపించనున్నాడట . రాయలసీమ నేపథ్యం లో కొంత అలాగే బిజినెస్ మెన్ గా , అలాగే కాలేజ్ స్టూడెంట్ గా నటించనున్నట్లు తెలుస్తోంది . ఇప్పటికే స్టూడెంట్ కు సంబందించిన సన్నివేశాలు చిత్రీకరించారు అలాగే బిజినెస్ మెన్ కు సంబందించిన సన్నివేశాలు కూడా చిత్రీకరించారు . ఇక ఇప్పుడేమో హైదరాబాద్ లో గ్రామీణ వాతావరణం సృష్టించి సీన్స్ చిత్రీకరిస్తున్నారు .

మహేష్ మూడు షేడ్స్ లో కనిపించడం అంటే అభిమానుల సంతోషానికి అంతే ఉండదు . భరత్ అనే నేను చిత్రంతో సూపర్ హిట్ కొట్టిన మహేష్ మళ్ళీ ఏడాది తర్వాత ప్రేక్షకుల ముందుకు రానున్నాడు . మహర్షి సినిమాని 2019 ఏప్రిల్ 5 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . ఈ సినిమాలో మహేష్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది .

English Title: Three shades of Mahesh babu in Maharshi