బిగ్ బాస్ లో అసలు మజా.. టికెట్ టు ఫినాలే గెలిచేదెవరు?


బిగ్ బాస్ లో అసలు మజా.. టికెట్ టు ఫినాలే గెలిచేదెవరు?
బిగ్ బాస్ లో అసలు మజా.. టికెట్ టు ఫినాలే గెలిచేదెవరు?

బిగ్ బాస్ అనేది వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో.. ఈ షో ఎందుకింత పాపులర్. ఇందులో అంతలా ఏముంది అనే సమాధానాలు వస్తే నిన్న జరిగిన ఎపిసోడ్ ఒక చిన్న ఉదాహరణగా నిలుస్తుందని చెప్పవచ్చు. నిజానికి తెలుగులో మొదటి రెండు సీజన్లతో పోలిస్తే మూడో సీజన్ చాలా చప్పగా సాగుతోంది. కంటెస్టెంట్స్ లో పోటీతత్వం లేకపోవడం, టాస్క్ లు కూడా అంత ఎఫెక్టివ్ గా లేకపోవడంతో ఈ సీజన్ పై ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గింది. అయితే మరో రెండు వారాల్లో బిగ్ బాస్ ముగుస్తుందనగా అసలైన టాస్క్ కంటెస్టెంట్స్ కు ఎదురైంది.

టికెట్ కు ఫినాలే అని చెప్పి నామినేషన్స్ ప్రాసెస్ ను సరికొత్తగా నిర్వహించాడు బిగ్ బాస్. దీని ప్రకారం హౌజ్ మేట్స్ అందరూ కొన్ని టాస్క్స్ ఆడాల్సి ఉంటుంది. ఈ టాస్క్ లలో ఎవరు ఎక్కువ పాయింట్లు సాధిస్తే వారు టికెట్ టు ఫినాలే గెలుచుకుంటారు. అంటే వారు డైరెక్ట్ ఫైనల్స్ కు వెళ్తారన్నమాట. మిగిలినవారు అందరూ నామినేషన్స్ లో ఉంటారు. అందులోనుండి ఒకరు ఎలిమినేట్ అవుతారు, మిగిలినవారు ఫైనల్స్ కు చేరుకుంటారు. ఈ నేపథ్యంలో టికెట్ టు ఫినాలే అందరికీ ఎంతో ముఖ్యం. ఏ టెన్షన్ లేకుండా వీక్ అంతా ఆడటానికి ఇది ఉపయోగపడుతుంది.

అందుకే కంటెస్టెంట్స్ అందరూ సేఫ్ గేమ్ ను పక్కనపెట్టి తమ శక్తిమేరకు ఈ టాస్క్ లో కష్టపడుతున్నారు. అందుకే చూసే ప్రేక్షకులకు మజా వస్తోంది. అసలు ఈ టికెట్ టు ఫినాలే టాస్క్ ఏమిటంటే.. మొదట బిగ్ బాస్ ఆరుగురు కంటెస్టెంట్స్ కు ఒక్కొక్కరికి ఒక్కో బోర్డు సెలక్ట్ చేసుకునే ఆప్షన్ ఇచ్చాడు. ఇవి ఆ కంటెస్టెంట్స్ కు బ్యాటరీస్ లాంటివి. ఇందులో అలీకి 70 శాతం రాగా, బాబాకు 40 శాతం, శ్రీముఖికి 50 శాతం, వరుణ్ కు 40 శాతం, రాహుల్ కు 50 శాతం, శివజ్యోతికి 60 శాతం బ్యాటరీ లైఫ్ వచ్చింది. ఈ టికెట్ టు ఫినాలే టాస్క్ పూర్తయ్యేసరికి ఎవరి దగ్గర ఎక్కువ బ్యాటరీ ఉంటుందో వాళ్ళు టికెట్ గెలిచినట్లు.

ముందుగా అలీ, శివజ్యోతి మధ్య మొదటి టాస్క్ జరగగా వారికి చెరొక అరటిపండు గెల ఇచ్చి ఎవరు ఎక్కువ అరటిపండ్లు తింటే వారు గెలిచినట్లు అని చెప్పారు. అలీ 21 అరటిపండ్లు తినగా, శివజ్యోతి 15 మాత్రమే తింది. దీంతో అలీ గెలుపొందాడు. తర్వాత టాస్క్ రాహుల్, వరుణ్ కు మధ్య జరిగింది. ఇద్దరికీ చెరొక థెర్మోకోల్ బ్యాగ్ ఇచ్చి ఎదుటివారి బ్యాగ్ ను ఎవరు ముందు ఖాళీ చేస్తారో వాళ్ళు గెలిచినట్లు అని చెప్పారు. ఈ టాస్క్ లో రాహుల్ గెలిచాడు. తర్వాతి టాస్క్ బాబా, శ్రీముఖి మధ్య జరిగింది. ఇందులో బాబా గెలుపొందాడు.

సెకండ్ ఫేజ్ లో అర్ధరాత్రి రెండున్నరకు అలీ, బాబా మధ్య టాస్క్ జరుగుతోంది. ఇందులో ఎవరు గెలుపొందారో ఇవాళ తెలుస్తుంది. దీంతో పాటు టికెట్ టు ఫినాలే గెలిచేవారు ఎవరో కూడా తెలిసిపోతుంది. ప్రస్తుతం బ్యాటరీ లైఫ్ బట్టి చూస్తే అలీకి 70 శాతం లైఫ్ ఉంది కాబట్టి తనకే గెలిచే ఛాన్స్ ఎక్కువగా ఉంది. కానీ ఇది బిగ్ బాస్ హౌజ్. ఇక్కడ ఏదైనా జరగొచ్చు.