టైట్ సెక్యూరిటీ మ‌ధ్య క్లైమాక్స్‌!


టైట్ సెక్యూరిటీ మ‌ధ్య క్లైమాక్స్‌!
టైట్ సెక్యూరిటీ మ‌ధ్య క్లైమాక్స్‌!

ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ క‌థానాయ‌కులుగా న‌టిస్తున్న భారీ క్రేజీ మ‌ల్టీస్టార‌ర్ చిత్రం `ఆర్ ఆర్ ఆర్‌`. ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌. రాజ‌మౌళి ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్నారు. యూనివ‌ర్శ‌ల్ మీడియా బ్యాన‌ర్‌పై డీవీవీ దాన‌య్య దాదాపు 350 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భార‌తీయ చిత్రాల్లోనే హాట్ టాపిక్‌గా నిలిచిన ఈ చిత్రం హాలీవుడ్ మూవీ `మోట‌ర్ సైకిల్ డైరీస్‌` స్ఫూర్తితో రూపొందుతోంది. రామ్‌చ‌ర‌ణ్ మన్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజుగా న‌టిస్తుండ‌గా, నిజాంపై తిరుగుబాటు బావుటాను ఎగ‌రేసిన విప్ల‌వ వీరుడు కొమ‌రం భీం పాత్ర‌లో ఎన్టీఆర్ న‌టిస్తున్నారు.

గ‌త కొంత కాలంగా ఈ సినిమాకు సంబంధించిన చిత్రీక‌ర‌ణ అత్యంత ర‌హ‌స్యంగా జ‌రుగుతోంది. సినిమా ప్రారంభంలో చిత్రీక‌రించిన కీల‌క స‌న్నివేశాల‌కు సంబంధించిన స్టిల్స్ బ‌య‌టికి రావ‌డంతో ఈ సినిమా విష‌యంలో ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. సెట్‌లో ప్ర‌తీ ఒక్క‌రి విష‌యంలోనూ క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ట‌. ప్ర‌స్తుతం ఈ సినిమాకు సంబంధించిన క్లైమాక్స్ స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ వైజాగ్ సిటీ స‌మీపంలోని మారుమూల గ్రామాల్లో జ‌రుగుతోంది. ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ పాల్గొన‌గా చిత్రీక‌రిస్తున్న ఈ ప‌తాక ఘ‌ట్టాల కోసం సెట్‌లో టైట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసిన‌ట్లు తెలుస్తోంది.

వైజాగ్‌కు స‌మీపంలోని రిమోట్ ఏరియాలో మొద‌లైన ఈ షెడ్యూల్ మ‌రో 6 రోజుల పాటు అక్క‌డే జ‌రుగుతుంద‌ని, ఇప్ప‌టికే ఎన్టీఆర్‌పై కీల‌క స‌న్నివేశాల్ని చిత్రీక‌రిస్తున్నార‌ని, త్వ‌ర‌లో రామ్‌చ‌ర‌ణ్ ఈ షెడ్యూల్‌లో పాల్గొంటార‌ని చిత్ర వ‌ర్గాల స‌మాచారం. 1920 కాలం నాటి స్వాతంత్ర పోరాటం నేప‌థ్యంలో ఈ సినిమా క‌థ సాగ‌బోతోంది. వ‌చ్చే ఏడాది జూలై 30న ఎట్టిప‌రిస్థితుల్లోనూ రిలీజ్ చేయాల‌ని ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలోని కీల‌క పాత్ర‌ల్లో అలియాభ‌ట్‌, అజ‌య్ దేవ్‌గ‌న్‌, స‌ముద్ర‌ఖ‌ని, రాహుల్ రామ‌కృష్ణ‌ల‌తో పాటు హాలీవుడ్ న‌టులు రే స్టీవెన్‌స‌న్‌, ఒలివియా మోరిస్‌, అలీస‌న్ డూడీ న‌టిస్తున్నారు.