టిక్ టిక్ టిక్ రివ్యూ


tik tik tik telugu movie reviewటిక్ టిక్ టిక్ రివ్యూ :
నటీనటులు : జయం రవి , నివేత పేతురాజ్
సంగీతం : డి . ఇమ్మాన్
నిర్మాత : చదలవాడ పద్మావతి
దర్శకత్వం : శక్తి సౌందర్ రాజన్
రేటింగ్ : 3 / 5
రిలీజ్ డేట్ : 22 జూన్ 2018

తమిళనాట ఈ ఏడాది జనవరిలో విడుదలై హిట్ అయిన ” టిక్ టిక్ టిక్ ” చిత్రాన్ని అదేపేరుతో తెలుగులో ఈరోజు విడుదల చేసారు . జయం రవి కీలక పాత్ర పోషించిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను అలరించేలా ఉందా ? లేదా ? అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే .

కథ :

అంతరిక్షం లోని భారీ ఉల్క వలన భారతదేశానికి పెను ముప్పు ఉందని , దాన్ని ఎదుర్కోవాలంటే వ్యోమగాములను అంతరిక్షం లోకి పంపాలని నిర్ణయిస్తారు శాస్త్రవేత్తలు . న్యూ క్లియర్ వెపన్ తో దేశానికి సంభవిస్తున్న ముప్పు ని తప్పించాలంటే అందుకు తగిన వాడైన వాసు ( జయం రవి ) ని అంతరిక్షం లోకి పంపిస్తారు . అంతరిక్షం లోకి వెళ్లిన వాసు న్యూ క్లియర్ వెపన్ ని దొంగిలించి దేశానికి వస్తున్న ముప్పు ని ఆపగలిగాడా ? లేదా ? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే .

హైలెట్స్ :

జయం రవి
కథ
విజువల్ ఎఫెక్ట్స్

డ్రా బ్యాక్స్ :

ఎంటర్ టైన్ మెంట్ లేకపోవడం

ప్లస్ పాయింట్స్ :

జయం రవి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు . స్పేస్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను సరికొత్త లోకానికి తీసుకెళ్లడం ఖాయం . జయం రవి – నివేత పేతురాజ్ ల జంట బాగుంది . యాక్షన్ ఎపిసోడ్స్ ప్రేక్షకులను థ్రిల్ కి గురి చేస్తాయి . విజువల్ ఎఫెక్ట్స్ కూడా ప్రేక్షకులను విశేషంగా అలరిస్తాయి .

మైనస్ పాయింట్స్ :

ఫస్టాఫ్ లో కొంత కథనం నీరసంగా సాగినప్పటికీ హీరో కు మాత్రం పూర్తి స్వాతంత్య్రం ఇచ్చాడు . అరివీర భయంకరమైన పోరాటాలు చేయించి ప్రత్యర్థులను మరీ తీసి కట్టుగా చూపించాడు . స్క్రీన్ ప్లే పరంగా మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఇంకా బాగుండేది .

సాంకేతిక వర్గం :

డి . ఇమ్మాన్ అందించిన సంగీతం ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది . నేపథ్య సంగీతం తో ఇమ్మాన్ అలరించాడు . వెంకటేష్ అందించిన ఛాయాగ్రహణం కూడా ఈ సినిమాకు మరో హైలెట్ గా నిలిచింది . నిర్మాణ విలువలు బాగున్నాయి . ఇక దర్శకుడు శక్తి సౌందర్ రాజన్ అంతరిక్షం నేపథ్యంలో కథ ని ఎంచుకొని గొప్ప సాహసమే చేసాడు . ప్రేక్షకులను ఆకట్టుకునే సన్నివేశాలను రాసుకొని విజువల్ ట్రీట్ ఇచ్చాడు .

ఓవరాల్ గా :

విభిన్నతరహా చిత్రాలను కోరుకునే వాళ్లకు ” టిక్ టిక్ టిక్ ” తప్పకుండా చూడాల్సిన సినిమా

                   Click here for English Review