2018 మోస్ట్ డిజైరబుల్ మెన్ విజయ్ దేవరకొండ


Times Most Desirable Man 2018 Vijay devarakonda

టాలీవుడ్ నయా సూపర్ స్టార్ విజయ్ దేవరకొండ 2018 మోస్ట్ డిజైరబుల్ మేన్ గా ఎంపికయ్యాడు . టాలీవుడ్ టాప్ స్టార్స్ చాలామందే ఉండగా వాళ్లందరినీ వెనక్కి నెట్టి మరీ మోస్ట్ డిజైరబుల్ మేన్ గా నెంబర్ వన్ గా నిలిచాడు విజయ్ దేవరకొండ . హైదరాబాద్ టైమ్స్ ఈ సర్వే నిర్వహించగా ఆ సర్వేలో మిగతా హీరోలను వెనక్కి నెట్టారు ఎక్కువ శాతం ప్రజలు విజయ్ దేవరకొండకు పట్టం కట్టారు దాంతో నెంబర్ వన్ గా నిలిచాడు విజయ్ దేవరకొండ .

 

ఇక ఈ హీరో తర్వాతి స్థానాల్లో ప్రభాస్ ,రాంచరణ్ ,  మహేష్ బాబు , రానా , నాగచైతన్య , వరుణ్ తేజ్ , ఎన్టీఆర్ లు నిలవడం విశేషం . విజయ్ దేవరకొండ గత ఏడాది గీత గోవిందం , టాక్సీ వాలా చిత్రాలతో సంచలనం సృష్టించాడు అందువల్ల కాబోలు మిగతా హీరోలను పక్కన పెట్టేలా చేసి ముందంజలో నిలిచాడు . తాజాగా విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ , క్రాంతిమాధవ్ చిత్రాలతో బిజీ గా ఉన్నాడు . ఇక డియర్ కామ్రేడ్ టీజర్ తో ఈనెల ప్రేక్షకుల ముందుకు రానున్నాడు విజయ్ దేవరకొండ .

English Title : Times Most Desirable Man 2018 : Vijay devarakonda