త్రివిక్రమ్, చిరంజీవి సినిమా గురించి తాజా అప్డేట్


త్రివిక్రమ్, చిరంజీవి సినిమా గురించి తాజా అప్డేట్
త్రివిక్రమ్, చిరంజీవి సినిమా గురించి తాజా అప్డేట్

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సైరా నరసింహారెడ్డి ప్రమోషన్లలో చాలా బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం తర్వాత నవంబర్ నుండి కొరటాల శివ సినిమా మొదలవుతుంది. అయితే చిరంజీవి, త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రాజెక్ట్ గురించి ఎప్పటినుండో వార్తలు వస్తున్న సంగతి తెల్సిందే. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడనేది మాత్రం ఇంకా క్లారిటీ అయితే లేదు. అసలు ఉందో లేదో అనేది ఇంకా మెగా ఫ్యాన్స్ కు ఎటువంటి క్లారిటీ లేదు.

దీనిపై ప్రస్తుతం చిరంజీవి స్పందించాడు. ఈ ప్రాజెక్ట్ కచ్చితంగా ఉంటుందన్న తరహాలోనే చిరంజీవి స్పందించాడు. త్రివిక్రమ్ ఇప్పటికే తనకు ఒక లైన్ వినిపించాడని, అది తనకు నచ్చిందని, పూర్తి స్క్రిప్ట్ వినిపించాక సినిమా ఎప్పుడనేది క్లారిటీ వస్తుందని చిరంజీవి స్పందించాడు. ఈ విషయం తెలియగానే చిరంజీవి ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యారని చెప్పవచ్చు.

ఎందుకంటే త్రివిక్రమ్ అంటేనే ఎంటర్టైన్మెంట్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్. ఎంటర్టైన్మెంట్ విషయంలో చిరు రేంజ్ ఏంటనేది స్పెషల్ గా మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలో చిరంజీవి, త్రివిక్రమ్ సినిమా ఎలా ఉంటుందనే ఊహాగానాలు ఇప్పటినుండే మొదలయ్యాయి.