సెన్సిబుల్ డైరెక్ట‌ర్ సినిమాకి `టైటానిక్` ట‌చ్‌!


సెన్సిబుల్ డైరెక్ట‌ర్ సినిమాకి `టైటానిక్` ట‌చ్‌!
సెన్సిబుల్ డైరెక్ట‌ర్ సినిమాకి `టైటానిక్` ట‌చ్‌!

`టైటానిక్‌`.. 1997లో వ‌చ్చిన ఈ చిత్రం వ‌ర‌ల్డ్ వైడ్‌గా సినీ ప్రియుల్ని ఉర్రూత‌లూగించింది. ప్రేమ‌క‌థా చిత్రాల్లో క్లాసిక్‌గా నిలిచిపోయిన ఈ సినిమా ఆస్కార్ బ‌రిలోనూ నిలిచి ద‌ర్శ‌కుడు జేమ్స్ కామెరాన్‌కు ఉత్త‌మ ద‌ర్శ‌కుడిగా అవార్డుని తెచ్చిపెట్టింది. ఈ చిత్రంలో హీరో చ‌నిపోయినా అత‌ని జ్ఞాప‌కాల‌తో ఎదురుచూసే ప్రేమికురాలిగా కేట్ విన్సేట్ అద్భుతంగా అభిన‌యించింది.

ఈ చిత్రాన్ని మ‌రోసారి ఓ తెలుగు ద‌ర్శ‌కుడు ఇండైరెక్ట్‌గా గుర్తుచేయ‌బోతున్నారు. నాగ‌చైత‌న్య హీరోగా శేఖ‌ర్ క‌మ్ముల రూపొందిస్తున్న చిత్రం `ల‌వ్‌స్టోరీ`. సాయి ప‌ల్ల‌వి హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇటీవ‌లే ఈ చిత్ర టైటిల్‌తో పాటు ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ని చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆస‌క్తిక‌ర‌మైన వార్త ఫిల్మ్ స‌ర్కిల్స్‌లో ప్ర‌స్తుతం చ‌క్క‌ర్లు కొడుతోంది.

`టైటానిక్‌` త‌ర‌హాలోనే యాక్సిడెంట‌ల్‌గా క‌లుసుకున్న ఓ జంట తెలంగాణ గ్రామీణ ప్రాంతం నుంచి సిటీ వ‌స్తార‌ని, త‌మ ల‌క్ష్యం కోసం ఇద్ద‌రు క‌లిసి ప్ర‌య‌త్నిస్తార‌ని, ఈ క్ర‌మంలో ప్రేమ‌లో ప‌డ‌తార‌ని, వారి మ‌ధ్య విడ‌దీయ రాని బంధం ఏర్ప‌డిన త‌రువాత హీరో చ‌నిపోతార‌ని, అత‌ని జ్ఞాప‌కాల్లోనే వుంటూ హీరోయిన్‌ మిగిలిన జీవితాన్ని గ‌డుపుతుంద‌నేది తాజా వార్త‌. టైటానిక్ ట‌చ్ వున్న ఈ సినిమా తెర‌పై ఎలాంటి మ్యాజిక్‌ని చేస్తుందో చూడాలి మ‌రి అంటున్నారు సినీ జ‌నం.