సెన్సార్ ఇబ్బందుల్లో షకీలా శీలవతి


title controversy for shakeela sheelavathiషకీలా సినిమా విడుదల అవుతోంది అంటే చాలు కేరళలో అగ్ర హీరోల సినిమాలు వాయిదా వేసేవాళ్ళు అప్పట్లో , అంతగా అగ్ర హీరోలకు సైతం వణుకు పుట్టించింది షకీలా . కట్ చేస్తే ఇప్పుడు ట్రెండ్ మారింది షకీలా కు కూడా సినిమాలు తగ్గిపోయాయి దాంతో కొంతకాలం సైలెంట్ గా ఉండిపోయింది . ఇక ఇప్పుడేమో మళ్ళీ తన మార్క్ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి వస్తోంది . శీలవతి అనే సినిమాలో నటించడమే కాకుండా నిర్మించింది కూడా .

ఇక సినిమాని విడుదల చేద్దామనుకొని సెన్సార్ కి పంపిస్తే అసలు శీలవతి అనే టైటిల్ వద్దు వెంటనే మార్చండి అని చెప్పేశారట సెన్సార్ సభ్యులు . సినిమా చూడకుండా ఆ టైటిల్ ఎందుకు పెట్టామో తెలీకుండా టైటిల్ మార్చమని ఎలా చెబుతారు అంటూ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది షకీలా . పైగా సినిమా కు ఇదే పేరుతో ప్రచారం చేసాం ఇప్పుడేమో టైటిల్ మార్చమంటే ఎట్లా ? అంటూ సెన్సార్ సభ్యులను ప్రశ్నిస్తోంది . ముందుగా సినిమా చూడండి ఆ తర్వాత టైటిల్ గురించి మాట్లాడండి అంటూ ఓ వీడియో పోస్ట్ చేసింది షకీలా .