కాజ‌ల్ మెహెందీ ఫంక్ష‌న్ ఈ రోజే!


కాజ‌ల్ మెహెందీ ఫంక్ష‌న్ ఈ రోజే!
కాజ‌ల్ మెహెందీ ఫంక్ష‌న్ ఈ రోజే!

కాజ‌ల్ అగ‌ర్వాల్ గ‌త కొంత కాలంగా త‌న ఫ్యామిలీ ఫ్రెండ్ గౌత‌మ్ కిచ్లూతో ప్రేమాయ‌ణం సాగిస్తోంది. ఇటీవ‌లే ఈ విష‌యాన్ని మీడియా ముఖంగా వెల్ల‌డించి అత‌న్నే వివాహం చేసుకోబోతున్న‌ట్టు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఈ నెల 30న ముంబైలో కాజ‌ల్ , గౌత‌మ్ కిచ్లూల వివాహం జ‌ర‌గ‌బోతోంది. ఈ వేడుక‌కి ఇరు కుటుంబాల‌కు చెందిన అత్యంత స‌న్నిహితులు మాత్ర‌మే హాజ‌రు కానున్నార‌ట‌.

పెళ్లికి మ‌రో రెండు రోజులే వుండ‌టంతో కాజ‌ల్ చాలా నెర్వ‌స్‌గా ఫీల‌వుతోంది. బ్యాచిల‌ర్ లైఫ్‌కి టాటా చెప్పేసే స‌మ‌యం ద‌గ్గ‌ర ‌ప‌డుతుండ‌టంతో పెళ్లికి మాన‌సికంగా సిద్ధ‌మ‌వుతోంది. ఈ స‌మ‌యాన్ని త‌న సోద‌రి నిషా అగ‌ర్వాల్‌తో గ‌డిపేస్తోంది. ఈ సంద‌ర్భంగా ఓ ఫొటోని షేర్ చేసిన కాజ‌ల్ ఆస‌క్తిక‌రంగా ట్వీట్ చేసింది.

`శ్రీ‌మ‌తి కాజ‌ల్ కావ‌డానికి మ‌రో రెండు రోజుల మాత్ర‌మే వున్నాయి. ఈ విలువైన స‌మ‌యాన్ని నా పార్ట్‌న‌ర్ నిషా అగ‌ర్వాల్‌తో గ‌డిపేస్తున్నాను` అని ట్వీట్ చేసింది. బుధ‌వారం మెహెందీ ఫంక్ష‌న్ జ‌ర‌గ‌బోతోంది. గురువారం సంగీత్ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. పెళ్లి వేడుక‌ల్లో మాత్రం హీరో బెల్లంకొండ శ్రీ‌నివాస్ పాల్గొన‌బోతున్నాడు.