హరికృష్ణ జయంతి సందర్బంగా కుటుంబ సభ్యుల నివాళి!


Nandamuri Harikrishna
Nandamuri Harikrishna

దివంగత నేత తెదేపా సీనియర్ నేత, నిర్మాత, నటుడు, నందమూరి హరికృష్ణ (సెప్టెంబర్2) 66వ జయంతి నేడు. ఈ సందర్బంగా ఆయన కుటుంబ సభ్యులు హరికృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన సమాధి వద్దకు వెళ్లి నివాళులు అర్పించారు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ” ఈ ఆస్థిత్వం మీరు.. ఈ వ్యక్తిత్వం మీరు.. మొక్కవోని ధైర్యము కొనసాగే మా ఈ ప్రస్థానానికి నేతృత్వం మీరు.. ఆ జన్మాంతం తలచుకొనే అశ్రుకణం మీరే అంటూ కళ్యాణ్ రామ్, ఎన్ఠీఆర్ (తారక్) హరికృష్ణ పోస్టర్ ను అభిమానులతో షేర్ చేసుకున్నారు.

ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. ” హరికృష్ణ గారు మనమధ్య లేకపోయినా తెదేపా నాయకుడిగా, రాజ్యసభ సభ్యుడిగా, ఆయన పార్టీకి, ప్రజలకు చేసిన సేవలు మనతో పంచుకున్న ఆత్మీయతలన్నీ చిరస్మరణీయం. హరికృష్ణ 66వ జయంతి సందర్బంగా హరికృష్ణకు నివాళులు అర్పిస్తున్నాను.. అని ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసారు.

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మాట్లాడుతూ.. అరుదైన వ్యక్తిత్వం.. అలుపెరగని పోరాట తత్త్వం హరికృష్ణ సొంతం. ఈ రోజు ఆయన జయంతి సందర్బంగా హరి మావయ్యకు నివాళులు అర్పిస్తున్నాను. మీరు మా మధ్యలేకపోయినా మీ జ్ఞాపకాలు ఎప్పుడు మా తోనే ఉంటాయి. జోహార్ నందమూరి హరికృష్ణ జోహార్..అంటూ లోకేష్ ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు..!