రానా ఎంగేజ్‌మెంట్ నేడే?


రానా ఎంగేజ్‌మెంట్ నేడే?
రానా ఎంగేజ్‌మెంట్ నేడే?

రానా ద‌గ్గుబాటి ఈ నెల 12న షాకింగ్ అప్‌డేట్‌ని అందించి అంద‌రినీ ఆశ్చర్య‌ప‌రిచిన విష‌యం తెలిసిందే. తాను ప్రేమించిన అమ్మాయిని ప‌రిచ‌యం చూస్తూ సోష‌ల్ మీడియా ఇన్ స్టా వేదిక‌గా రానా పెట్టిన పోస్ట్ టాలీవుడ్ వ‌ర్గాల‌ని విస్మ‌యానికి గురిచేసింది. నిత్యం పెళ్లి వార్త‌ల‌పై స‌మాధానం చెప్ప‌కుండా త‌ప్పించుకు తిరిగిన రానా ఉన్న‌ట్టుండి త‌న ప్రేమ వ్య‌వ‌హారాన్ని వెల్ల‌డించ‌డం షాక్‌కు గురిచేసింది. హైద‌రాబాదీ యువ‌తి మి‌హీకా బ‌జాజ్‌ని తాను ప్రేమిస్తున్నాన‌ని, త్వ‌ర‌లో ఇద్ద‌రం వివాహం చేసుకోబోతున్నామ‌ని వెల్ల‌డించారు.

ఆ త‌రువాత రానా ప్రేమ‌, పెళ్లిపై నిర్మాత‌, రానా ఫాద‌ర్ డి.సురేష్‌బాబు స్పందించారు. ఇద్ద‌రి గురించి త‌మ‌కు ముందే తెలుస‌ని, ఒక‌రినొక‌రు తెలుసుకోవ‌డానికి ఇంత కాలం ప‌ట్టింద‌ని క‌రోనా ప్ర‌భావం త‌గ్గాక లాక్‌డౌన్ అనంత‌రం పెళ్లిపై ప్ర‌క‌టిస్తామ‌ని, డిసెంబ‌ర్‌లో వివాహం చేయాల‌నుకుంటున్నామ‌ని స్ప‌ష్టం చేశారు. ఇదిలా వుంటే రానా ఫ్యామిలీ తాజాగా మ‌రో షాక్ ఇస్తోంది. రానా, మిహికా బ‌జాజ్‌ల నిశ్చితార్థం ఈ రోజు (బుధ‌వారం` సాయంత్రం 4 గంట‌ల‌కు రామానాయుడు స్టూడియోస్‌లో జ‌ర‌ప‌బోతున్నారు.

ఇదే రోజు రానా, మిహికాల వివాహానికి సంబంధించిన ముహూర్తాన్ని కూడా ఫిక్స్ చేయ‌నున్నార‌ట‌. ముందు అనుకున్న‌ట్టే రానా తండ్రి సురేష్‌బాబు వివాహాన్నిడిసెంబ‌ర్‌లో జ‌ర‌ప‌బోతున్నార‌ట‌. ఇదే విష‌యాన్ని ఆ రోజు వెల్ల‌డించే అవ‌కాశం వుంద‌ని విశ్వ‌స‌నీయ స‌మాచారం.